ఆలపాటిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెమ్మసాని

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 64వ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ప్రజా సంక్షేమం కోరే రాజా వంటి నాయకులు ప్రజలకు ఎల్లకాలం అందుబాటులో ఉండాలని అభిలషించారు. ముందుగా ఆలపాటిని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికల బిజీ షెడ్యూల్‌ సమయంలోనూ తన పుట్టినరోజును గుర్తించుకుని ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలియజేసిన పెమ్మసాని వ్యక్తిత్వాన్ని అభినందించారు. పెమ్మసాని వంటి నాయకులు మన పార్లమెంట్‌కు రావడం గుంటూరు జిల్లా వాసుల అదృష్టమని కొనియాడారు.

Leave a Reply