Suryaa.co.in

National

కేరళలో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు

-50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు
-మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడి

కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్టు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ సెంటర్లలో ఈ నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్టు రిపోర్టులో తెలిపింది.

LEAVE A RESPONSE