– జండాను ఆవిష్కరించి వారోత్సవాలు ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
– యాజమాన్యాల చేతిలో కార్మికుల ప్రాణాలు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంగళవారం ఉదయం 54వ జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైల్వే కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా 54 వ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా భద్రత పట్ల అవగాహన కల్పించే మహత్తరమైన బాధ్యతను తమపై వేసుకుని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చిన కొండపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారికి, అన్ని విధాల వారికి సహకరించిన మా డిపార్ట్మెంట్ అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.
జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నా కార్మిక లోక కుటుంబ సభ్యులందరినీ ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ రోజైతే నేను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ఆ రోజు నుండే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులంతా నా కుటుంబ సభ్యుల కింద భావిస్తున్నాను. నా కుటుంబ సభ్యుల భద్రత నా బాధ్యతగా భావిస్తున్నాను.
అయితే ఈ వారోత్సవాలలో భాగంగా కేవలం కార్మికులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి, విద్యార్థులందరికీ కూడా భద్రత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. పోటీల్లో గెలుపొందిన వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. 54వ జాతీయ భద్రత వారోత్సవాలు సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ కృషియల్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే నినాదం తో ప్రారంభించడం జరిగిందన్నారు. అంటే కార్మికులు భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుంది. కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుంది అనే స్పష్టమైన సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు.ఈ కలను నిజం చేసే బాధ్యత యాజమాన్యాల పైన కార్మికుల పైన అధికారులందరి పైన ఉందన్నారు.
యాజమాన్యాలు మరింత బాధ్యత తీసుకోవాలనీ, ఎందుకంటే ఎప్పుడైతే కార్మికుడు మీ పరిశ్రమలో అడిగి పెట్టాడో అప్పుడే అతడు ప్రాణం మీ చేతిలో ఉన్నట్టేనని చెప్పారు.అందుకే రోజు తప్పకుండా భద్రతా ప్రతిజ్ఞ ను పాటించి దానిపైన అవగాహన కలిగించాలన్నారు. అలాగే భద్రత నియమాలని చాలా సరళమైన భాషలో కార్మికులందరికీ అర్థమయ్యేలా స్థానిక భాషలలో రూపొందించాలన్నారు.
రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ రసాయనాల పట్ల,వాటి వలన జరిగే ప్రమాదాల పట్ల శిక్షణా తరగతులను నిర్వహించాలనీ,స్మోక్ అలారం,వంటి ప్రమాదాల్ని ముందుగానే పసిగట్టి నివారించేటట్లు టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఇందులో కార్మికుల పాత్ర చాలా కీలకమాన్నారు.అందులోకార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ కిడ్స్ వేసుకునే పని ప్రాంతాల్లో తిరగాలి. నాకు ఒక కార్మికుడు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి పెట్టుకోవడం లేదని సమాధానం చెప్పాడన్నారు. జుట్టు కన్నా ప్రాణం గొప్పదని తెలుసుకోవాలన్నారు.
మీరు అశ్రద్ధగా ఉంటే మీతో పాటు చుట్టుపక్కల కార్మికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుసుకోవాలన్నారు. మీరు క్షేమంగా తిరిగి రావాలని మీ కుటుంబం మీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుందన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలనీ మంత్రి గుర్తు చేశారు.మొన్న ఒక పరిశ్రమంలోని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరుగుతున్న ప్రాంతాన్ని మిగతా కార్మికులంతా సెల్ఫీ తీసుకోవడం నా దృష్టికి వచ్చిందనీ, ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి సరదాలు చేయకూడదనీ కార్మికులకు హితవు పలికారు.
ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని కీలక బాధ్యతలు తీసుకుంటుందనీ దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఒక నెలలో కొలిక్కి వస్తుందనీ, వచ్చాక ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామాన్నారు.
ఈ రకంగా యాజమాన్యాలు కార్మికులు ప్రభుత్వ యంత్రాంగము అందరూ కలిసి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతోనే ముందుకు వెళ్లాల్సిందిగా మంత్రి కోరారు. కార్మిక లోకపు కల్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ మంత్రి వాసంశెట్టి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు కొండపల్లి ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రతినిధి రామచంద్రరావు, రామ్స్ ప్లాంట్ హెడ్ ఆశిష్ కుమార్, కెసిపి ప్లాంట్ హెడ్ మధుసూదన్ రావు, జాయింట్ చీఫ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు, ఉషశ్రీ, డి సి ఐ పి శివకుమార్ రెడ్డి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సమైక్యత వాక్
అంతకుముందు ఉదయం విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ లో విద్యార్థులు కార్మికులతో కలసి సమైక్యత నడక కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మాక్ నిర్వహించి మంత్రికి వందనాలు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికులను విద్యార్థులను అభినందించారు అనంతరం వారితో కలిసి పలహారం కార్యక్రమంలో పాల్గొని వారితో మాట్లాడుతూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం రైల్వే కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.