ఖమ్మం నుంచి పోటీకి బీజేపీ నేత పుల్లారావు యాదవ్ దరఖాస్తు
ఓయులో తెలంగాణ సమర నినాదం చేసిన పుల్లారావు యాదవ్
ఉద్యమ సమయంలో బీసీలను ఏకం చేసిన జేఏసీ నేత
పోటీకి సై అన్న ఓయు విద్యార్థి నేత
బీజేపీ కార్యాలయంలో ఓయు విద్యార్థి నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన పోటీకి కోసం దరఖాస్తు చేస్కున్నారు. ఓయు ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమం నుండి చురుకైన పాత్ర పోషించిన పుల్లారావు యాదవ్ , ఖమ్మం జిల్లా వాసి కావటం వలన బలమైన సామాజిక వర్గం యాదవ్ కులస్థుడు కావటం కూడా పుల్లారావు కి కలిసి వచ్చే అవకాశం .
బీజేపీ లో గరికపాటి మోహన్ రావుతో కలిసి పార్టీ లో చేరినప్పటి నుండి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామా యాత్ర లో కీలక భూమిక పోషించారు . ఈవెంట్ ఆర్గనైజర్ గా బండి సంజయ్ పాదయాత్ర లో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ, బండి సంజయ్ దృష్టిలో పడ్డారు.
పుల్లారావు నేర్పరితనం చూసిన బండి సంజయ్ .. పుల్లారావుకి నిరుద్యోగ మార్చ్ లో అవకాశం కల్పించి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గా నియమించారు. అలా ప్రతి నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం లో కీలక భూమిక పోశించారు పుల్లారావు . అనంతరం తన పనితనాన్నీ గౌరవిస్తు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమకం చేశారు . ఇలా యే పని లో నైనా అకుంటిత దీక్ష తో ముందుకు వెళ్లే పుల్లారావు కి అవకాశం కల్సివచ్చి , ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇవ్వగలిగితే .కచ్చితంగా పువ్వాడకు చుక్కలు చూపిస్తామ ని .. ఖమ్మం జిల్లా యువత .. ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. .నువ్వు ఎలా గెలుస్తావ్ అని ఎవరైన అడిగితే.. హుజూరాబాద్ ఎలక్షన్ లో ఈటెల రాజేందర్ ని గెలిపించడం కోసం 6 నెలల కస్ట్పడ్డ. ఆ ఎన్నికలలో ఎన్నో అంశాలు నేర్చుకున్నా. అదే అనుభవం తో ఖమ్మంలో గెలుపు దిశ గా పావులు కదపుతానని పుల్లారావు పేర్కొన్నారు.
మంత్రి అజయ్‌ను ఓడించటమే నా లక్ష్యం: పుల్లారావు యాదవ్
‘నేను ఓయులో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించా. అప్పట్లో ఉద్యమంలో భాగస్వామ్యం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించా. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. నేనేంటో ఓయు విద్యార్ధులకు తెలుసు. అప్పట్లో నాపై ఎంతమంది ప్రలోభాలు పెట్టినా, తెలంగాణ ఉద్యమం నుంచి తగ్గలేదు. నేను వ్యక్తిగతంగా నష్టపోయానే తప్ప, నా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించా. బీసీ నేతగా అదీ నా చిత్తశుద్ధి. రేపటి ఖమ్మం ఎన్నికల్లో నాకు బీజేపీ టికెట్ ఇస్తే, ఓయులోని బడుగు బలహీన వర్గాల విద్యార్ధులంతా నా విజయం కోసం పనిచేస్తారన్న విశ్వాసం నాకుంది. మంత్రి అజయ్‌ను ఓడించాలన్న నా లక్ష్యానికి పార్టీ అండగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని పుల్లారావు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.