అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర
సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్ర
కర్ణాటకలో రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు?
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు?
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు తెలంగాణకు 6 గ్యారెంటీలు అంటూ ప్రకటించడం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడంలో భాగమేనంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి , జీహచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక , రాష్ట్ర అధికార ప్రతినిధులు విఠల్ , రాకేష్ రెడ్డి , సంగప్ప గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజ్యవర్థన్ రెడ్డి , సీనియర్ నాయకులు సునీత రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ…బిజెపి వైషమ్యాలు సృష్టిస్తోందంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీ పై విషప్రచారం చేశారు.జీ-20 సమావేశాలతో ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని చాటిన తీరును జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ విషం చిమ్ముతోంది.దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, విశ్వగురువుగా నిలపాలనే మోదీ కృషిని తట్టుకోలేకపోతోంది.మత చిచ్చు, వైషమ్యాలు సృష్టించేది కాంగ్రెస్ పార్టీదే.సనాతన ధర్మానిది 4వేల సంవత్సరాల చరిత్ర. అలాంటి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్ర చేస్తున్నారు.
భారతదేశంలో అన్ని కులమతాలను, ధర్మాలను గౌరవించుకుంటూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది.కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.యూపీఏ పాలనలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 11 వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు ఐదో స్థానానికి ఎదగిందంటే కారణం నరేంద్ర మోదీ గారి కృషి వల్లే.కోవిడ్ రక్కసితో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ప్రపంచ దేశాలు తల్లిడిల్లిడిల్లిపోయినా… భారతదేశాన్ని కాపాడి ఆర్థిక వృద్ధిని సాధించి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిపిన ఘనత నరేంద్ర మోదీ ది.
మోదీ కి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కీర్తిని ఓర్చుకోలేక కాంగ్రెస్ అసూయను వెల్లగక్కుతోంది.దళితులు, మైనారిటీలకు అన్యాయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. మతాలు, కులాల పేరుతో రెచ్చగొడుతోంది.కాంగ్రెస్ అధికార యావ తప్ప.. దేశంపై ప్రేమ ఏమాత్రం లేదు.తెలంగాణకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలంటున్నరు… అవి అమలుకు నోచుకోని హామీలే..కర్ణాటకలో రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు..? రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? గాంధీ పేరు పెట్టుకుని ఇన్నాళ్లు దేశాన్ని ఏలినా పేదరికాన్ని నిర్మూలించలేదేం?కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విశ్వాసం కోల్పోయింది. అందుకే, మతచిచ్చు రేపి రాజకీయాలకు వాడుకుంటోంది.
తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది.తెలంగాణ ప్రజలు భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా?తెలంగాణలో ఆర్టీసీ ని ఏ స్థాయికి తీసుకు వచ్చారో .. కర్ణాటక లో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది.కర్ణాటక లో ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.ఎంత దూరమైన ఉచిత ప్రయాణమన్నారు.. ఇప్పుడు 30 కి.మీ అంటూ కుదించిన్రు.
ముందుగా కాంగ్రెస్ ఇవ్వాల్సిన 3 గ్యారెంటీలు…
1) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారరని..
2) కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్కాములుండవని..
3) తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టియ్యమని…
ఈ గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతే మీరు మాట్లాడండి.
గ్రామాలు, రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అణచివేసింది. ప్రజలను మోసం చేసింది.పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే .. కవిత తమ చొరవేనంటూ నాటకాలు ఆడుతోంది.కవిత లేఖ రాస్తేనే కేంద్రం మహిళా బిల్లు పెట్టినట్లు చెబుతోంది. కవిత వ్యవహారం చూస్తే హాస్యాస్పదంగా ఉంది.
కవిత..! తెలంగాణలో మహిళలకు సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వమని మొదలు మీ నాన్న కేసీఆర్ కి చెప్పు.బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కానీసం 15 రిజర్వేషన్ అమలు చేయలేదు ఎందుకు? పార్టీ లో ఒక్క మహిళ కు అయినా అత్యున్నత పదవి ఇచ్చారా?పేదలకు ఇండ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా…. లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు తోడు దొంగలు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుంది.ఈసారి బిజెపి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు చూసి బిజెపి ని గెలిపించాలి.