-సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలి
-మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ లను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మలేరియా, డెంగ్యూ లను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యాధికాలను ఆదేశించారు. వైరల్ ఫీవర్ ల నివారణకు అవసరమైన మందులను ఇంటింటికి తిరిగి జన సర్వే నిర్వహించి బాధితులకు అవసరమైన మందులను అందజేయాలని మంత్రి అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.