ఒకదాని వెంట
ఒకటిగా విప్లవమే..
స్వాతంత్య్రానికి ముందు
పరాయిపాలనపై తిరుగుబాటు..
అటు తర్వాత స్వపరిపాలనపై..!
మొత్తానికి జీవిత పర్యంతం
ఉద్యమమే మాధ్యమం..
దుర్మార్గానికి వ్యతిరేకంగా
గాంధీ మార్గమే..
మనిషిగా సన్మార్గమే!
జయప్రకాశ్ నారాయణ్…
లోక్ నాయక్..
ఈ పేరే పోరాటాలకు చిరునామా..
ఇందిరమ్మ ఆధిపత్యాన్ని
ప్రశ్నించిన తొలి గళం..
అదిరిపోయిన ఎమర్జెన్సీ గందరగోళం..!
నెహ్రూ ఆహ్వానంతో
రాజకీయాల్లోకి వచ్చినా
ఆ నెహ్రూ కూతురికే
తప్పు చేసావు తప్పుకో..
అంటూ అల్టిమేటం..
మొదలైన ఎమర్జన్సీ కోలాటం!
ఒకనాడు స్వతంత్రం కోసం..
మరోనాడు కుతంత్రంతో
సగం జీవితం కారాగారమే..
మనసు మాత్రం ఎప్పుడూ
తిరగబడే కర్మాగారమే..!
అనారోగ్యంతో అలసినా..
కిడ్నీలు కునారిల్లినా…
రక్తంలో పోరాట పిపాస..
బెడ్డు మీదున్నా ప్రజాసమస్యలపైనే ధ్యాస..
అలా పోరాడుతూనే తుదిశ్వాస!
ఊపిరి విడిచే ముందైనా
మారని విధానం..
వినోబాభావే మార్గంలో
భూదానం..
చేసిన పోరాటాలకు..
త్యాగాలకు గుర్తింపుగా
మరణానంతరం
అతున్నత పురస్కారం
భారతరత్న ప్రదానం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286