వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయింపు
ఎంపీ విజయసాయిరెడ్డి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ నుంచి పాలన చేసేందుకు కీలక అడుగు వేసిందని, ఈ మేరకు మిలీనియం టవర్లలో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోందని అన్నారు. ఎ, బి టవర్లలో 1.75 లక్షల చదరపు అడుగుల వసతి, 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాలు కేటాయింపు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలకు వీటిలో 2.27 లక్షల చదరపు కేటాయించిందని అన్నారు.
సంకల్పంతో ముందుకు అడుగులు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి సంకల్పంతో అడుగులు వేస్తోందని, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఉన్నత చదువులకు ఊతం ఇవ్వటానికే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు టెన్త్ ఉత్తీర్ణత, కనీస వయసు నిబంధనలు పెట్టిందని చెప్పారు. అయితే “వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు టెన్త్ ఉత్తీర్ణత, కనీస వయసు నిబంధనలు ఎందుకని చాలా మంది ప్రశ్నించారని, ఆ షరతులతో బాల్య వివాహాలకు అడ్డుకట్టతోపాటు ఉన్నత చదువులకు ఊతం లభిస్తుందనే పవిత్రమైన ఉద్దేశ్యం దీని వెనుక ఉందని అన్నారు.నాయకులుగా ఉండేటప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలని అన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద సీఎం జగన్ రూ.81.64.55.000 విడుదల చేశారని అన్నారు.
డీప్‌ఫేక్ వీడియోలు అరికట్టే కఠిన చట్టాలు అవసరం
డీప్‌ఫేక్ వీడియోలను ఆపడానికి కొత్త చట్టాన్ని రూపొందించే ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నానని, తప్పుడు, అసభ్యకర, అభ్యంతరకర వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. డీప్‌ఫేక్ వీడియోలపై కఠినమైన చట్టాలు అవసరమని, డీప్‌ఫేక్ సాంకేతికత, దానిని సృష్టించగల సామర్థ్యం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉండడం బాధాకరమని అన్నారు. ఈ సాంకేతికత నిరంతరం దుర్వినియోగం అవుతోందని, దీనిని అరికట్టేందుకు తక్షణమే చట్టం చేసి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.