Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్ వ్యవస్థపై సినిమా

– టైటిల్‌ను లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్య కిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు. వివాదాలకు కేంద్రంగా మారిన వాలంటీర్ వ్యవస్థనే కేంద్రబిందువుగా తీసుకుని ఏకంగా సినిమా తీయడమే విశేషం.

 

LEAVE A RESPONSE