– అధికారం మూర్తీభవించిన అహంకారంతో రేవంత్ రెడ్డి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి వ్యవహారం నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.28,817 కోట్లు రుణమాఫీ చేసింది. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చింది. ఏడాదికి రూ.10,500 కోట్లతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందజేశాం. వివిధ కారణాలతో మరణించిన లక్ష 11 వేల రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రైతుబీమాతో అండగా నిలిచింది.
24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదని నిస్సిగ్గుగా వ్యతిరేకించింది కాంగ్రెస్. 3 గంటల కరంటు చాలు, 10 హెచ్ పీ మోటార్ పెడితే గంటకు ఎకరా తడుస్తుంది అని చెప్పింది రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 న రూ.2 లక్షల వరకు రుణమాఫీ, డిసెంబర్ 9న ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున రైతుభరోసా, డిసెంబర్ 9న ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500, డిసెంబర్ 9న ప్రతి దివ్యాంగునికి రూ.6 వేలు ఫించను, డిసెంబర్ 9న ప్రతి అవ్వా,తాతకు, ఒంటరి మహిళకు, వితంతువులకు రూ.4 వేల ఫించన్ అని చెప్పింది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి.
15 నెలల పాలనలో రెండు సార్లు రైతుభరోసా ఎగ్గొట్టి, రూ.15 వేల రైతుభరోసా రూ.12 వేలకు కుదించి కనీసం మూడెకరాల వరకు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వకుండా, అరకొర రుణమాఫీ చేసి, అసలు ఫించను ఒక్క రూపాయి పెంచకుండా, రూ.2500 మహాలక్ష్మి పథకం అసలు అమలు చేయకుండా, సాగునీళ్లను ఎగ్గొట్టి, పంట కొనుగోళ్లను పక్కనపెట్టి, క్వింటాలుకు బోనస్ రూ.500 ఎగ్గొట్టి, రైతుబీమాకు ప్రీమియం కట్టకుండా , రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి నిర్లజ్జగా ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటు.
ఇది ప్రజాపాలన కాదు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న పాలన. అధికారం ఉందని ప్రజల ఆకాంక్షలు, ఆశలను అవహేళన చేస్తున్న పాలన. పదేళ్ల బీఆర్ఎస్ పాలన మీద దుష్ప్రచారం చేసింది స్వయంప్రకటిత మేధావులు, వ్యక్తిగత ప్రయోజనాలు, పదవులు దక్కనివారు. పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది పదేళ్ల కేసీఆర్ పాలనలో దక్కిన నీళ్లు, నిధులు, పథకాలు, సంక్షేమాన్ని కోల్పోయిన సామాన్య ప్రజలు.
అధికారంతో మూర్తీభవించిన అహంకారంతో, రేవంత్ రెడ్డి మీడియా మేనేజ్ మెంట్ తో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించగలనని భావిస్తున్నాడు. ఒక్కసారి మోసపోయిన చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మళ్లీ, మళ్లీ మోసపోదు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పేందుకు ఎదురుచూస్తున్నది