Suryaa.co.in

Andhra Pradesh International National

శ్రీలంక ప్రధానమంత్రి రాజపక్సకి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజ పక్సే కి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల, సంగీత88448275నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎస్.పి వెంకటప్పల నాయుడు, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరి వెళ్ళారు. శుక్రవారం ఉదయం తన కుటుంబసభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

LEAVE A RESPONSE