Suryaa.co.in

Andhra Pradesh

పార్టీకి కార్యకర్తలే ముఖ్యం.. ప్రజలకు పార్టీకి వారధిగా పనిచేసేది కార్యకర్తలే

– పార్టీకి ప్రచార సాధకులు ఐటీడీపీ కార్యకర్తలు
-కానీ నాకున్న విజన్ తో పేదల్ని ధనవంతులుగా చేసి తీరుతాం, అది నా జీవిత ఆశయం
-హజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట
-మంత్రులకు సాక్షి స్రిప్ట్ చదవటం తప్ప సబ్జెక్ట్ తెలియదు
-వైసీపీ పాలనకు ఎక్స్ పైర్ డేట్ దగ్గర పడింది
-ఐటీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తాం
-టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఐ – టీడీపీ అభినందన సదస్సులో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

పార్టీకి ప్రచార సాధకులు ఐటీడీపీ కార్యకర్తలు, సెల్ ఫోన్ ఉపయోగించి ప్రపంచాన్ని జయిస్తున్నారు. గతంలో సమాచారం చేరవేయటం కష్టంగా ఉండేది, కానీ నేడు న ఐటీడీపీ ద్వారా ఫోన్లనో క్షణాల్లో పార్టీ కార్యక్రమ సమాచారాన్ని చేరవేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేశారు.

పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, ప్రజలకు పార్టీకి వారధిగా పనిచేసేది కార్యకర్తలే. మహానాడులో ప్రకటించిన టీడీపీ మిని మ్యానిఫెస్టో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి చేరింది, మన మ్యానిఫెస్టోపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తాం.

తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్దులుంటే అందరికీ ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. వైసీపీ పాలనలో నిత్యసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.జాబు రావాలంటే బాబు రావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీదే. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచటం తెలిసిన పార్టీ టీడీపీ. మన రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేవు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం.

నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం.మంచి నీళ్లు కోసం ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు ఇచ్చే బాధ్యత టీడీపీదే.దశాబ్దాల నుంచి పేదలుగా పేదలుగానే మిగిలిపోతున్నారు, పేదల్ని ధనికుల్ని చేయాలన్న సంకల్పంతో ఫార్ములా – 4 తీసుకున్నాం. పేదలకు ఫార్ములా – 4 అనేది ఒక మంత్రం , ప్రతి పేదవాడిని ధనికుడిని చేసే బాధ్యత టీడీపీదే.

పేదలంటే గిట్టని వాళ్లు పార్ములా – 4 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కానీ నాకున్న విజన్ తో పేదల్ని ధనవంతులుగా చేసి తీరుతాం, అది నా జీవిత ఆశయం.ఐటీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలి. నిన్న నంబూరులో హజ్ యాత్రకు వెళ్లే వారికి కలవడానికి ముందుగా నేను షెడ్యూల్ ఇస్తే ..నాకు అనుమతివ్వకుండా అదే షెడ్యూల్ కి సీఎం వెళ్లారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? అధికారం ఉందని ఇస్టారుసారంగా వ్యవరించటం సిగ్గుచేటు.

టీడీపీ హయాంలో రూ. 140 కోట్లు కేటాయించి హజ్ హౌజ్ కి శంకుస్ధాపన చేశాం, కానీ జగన్ దాన్ని నిర్వీర్యం చేశారు. హజ్ హౌస్ కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట, టీడీపీ అధికారంలోకి రాగానే విజయవాడలో దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ హౌస్ నిర్మిస్తాం.శంకుస్ధాపనలు చేసిన వాటికి మళ్లీ శంకుస్ధాపనలు చేయటం తప్ప ఈ ముఖ్యమంత్రి ఒక్క పని అయినా పూర్తి చేశారా?

బోగాపురం విమానాశ్రయం, మచిలిపీట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ కి రెండో సారి శంకుస్దాపనలు చేశారు, తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు.మంత్రులకు సాక్షి స్రిప్ట్ చదవటం తప్ప సబ్జెక్ట్ తెలియదు, ప్రతి రోజూ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.హైదారాబాద్ కి దీటుగా అమరావతి నిర్మించాలని సంకల్పించాం, కానీ జగన్ మూడు ముక్కలాటతో ప్రజల భవిష్యత్ తో ఆటలాడుతున్నారు.అమరావతి ఎక్కడికి వెళ్లదు, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తాం.

జగన్ కి ఇచ్చిన టైం అయిపోయింది, వైసీపీ పాలనకు ఎక్స్ పైర్ డేట్ దగ్గర పడింది. అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రి. సొంతూళ్లో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి. నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి.పెట్టుబడులు గురించి అడిగితే కోడిగుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి. జగనుకు కోర్టుల్లో అనూకుల తీర్పులు రావాలని హిందూ దేవాలయాల సొమ్ముతో యాగాలు చేసేవాడు దేవదాయ శాఖ మంత్రి. రైతు బజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రి. పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యా మంత్రి. ఇలాంటి మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? మంత్రుల అసమర్దను, వైసీపీ వైఫల్యాలను ఐటీడీపీ కార్యకర్తలు ప్రజల్లో ఎండగట్టాలి.

ఎన్నికలకు 9 నెలలే సమయం ఉంది, యుద్దానికి మీరంతా సిద్దం కావాలి ప్రతి వ్యక్తి శక్తివంతమైన ఐటీ సాదనం కావాలి.ఐటీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తాం, కంపెనీలతో మాట్లాడి వర్క్ ప్రం హోం, లేదా ఆఫీసుల్లో ఉద్యోగాలు కల్పిస్తాం.

మీ టాలెంట్, స్కిల్స్ ను బట్టి విదేశాల్లో సైతం ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.వచ్చే ఎన్నికలు దోపిడి దారులకు పేదలకు మద్య జరుగుతున్న యుద్దం, దోపిడి దారులు దోచుకున్న డబ్బంతా పేదలకు పంచుతాం. కౌరవ సభను గౌరవ సభగా చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వచ్చే కురుక్షేత్రం లో కౌరవ వధ జరగాలి.

LEAVE A RESPONSE