Suryaa.co.in

Andhra Pradesh

డేటా విజువలైజేషన్‌లో అద్దంకి విద్యార్థికి 6వ స్థానం

అద్దంకి: డేటా విజువలైజేషన్లో అద్దంకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆల్ ఇండియా లెవల్ లో ఆరో స్థానం సాధించారు. విద్యార్థి పొన్నలూరి జయంత్ జెయంత్ ఆర్ వి ఆర్ అండ్ జె సి ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరు లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ నిర్వహించారు. సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. టాప్ ముప్పైలో ఆరో స్థానం రావటం అద్దంకి వాసిగా గర్వకారణమని పలువురు అభినందించారు. కాగా, ప్రభుత్వం మెరిట్‌ సర్టిఫికెట్‌ తోపాటు ఇరవైవేలు నగదు ప్రోత్సాహం అందించనుంది. జయంత్‌ పదోతరగతి వరకు భవిష్య స్కూల్, ఇంటర్ విశ్వభారతిలో గ్రామీణ వాతవరణంలో చదివాడు.

LEAVE A RESPONSE