Suryaa.co.in

National

కొండకరకం బిడ్డ ‘బంగారం’!

– వెయిట్ లిఫ్టింగ్ సత్తాచాటిన ఉత్తరాంధ్ర అమ్మాయి
– ఆసియన్ ఛాంపియన్ షిప్ లో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన రెడ్డి భవాని

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటింది. ఏకంగా మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లా, కొండకరకం గ్రామమానికి చెందిన రెడ్డి భవాని శనివారం ఇండియా తరుపున ఆసియన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. తండ్రి రెడ్డి ఆదినారాయణ తాపీ మేస్త్రి. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. మొదటి ఆడపిల్లకి పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోతే ఇల్లు అమ్మి పెళ్లి చేయాల్సిన పరిస్థితి…. అయినా ఒక్క అడుగు వెనక్కి వేయకుండా తన రెండో కూతురు రెడ్డి భవానిని క్రీడల వైపు పంపారు.

తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెడ్డి భవాని శభాష్‌ అనిపించుకుంది. ఈ విజయానికి రితిక్ మాస్టర్ తమ్ముడైన గాదిపల్లి ఆనంద్ సహకరించారు. ఈ అమ్మాయిని చెల్లిలా ఆదరించి, వెయిట్ లిఫ్టింగ్ లో మెలకువలు నేర్పించాడు. ఇటీవలె గాదిపల్లి ఆనంద్ కూడా అసిస్టెంట్ కోచ్ గా అర్హత సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా ఇద్దరిని పలువురు అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE