-మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అధోగతిపాలు పట్టించారుని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీలో 33 వేల ఎకరాలు కాదు 50వేల ఎకరాలు కావాలి అన్న జగన్.. మాట మార్చి మడమ తిప్పారు. ఆరోజు అమరావతి రాజధాని అని ఒప్పకొని నేడు కాదనడం సబబేనా? చట్టసభలపట్ల జగన్ కు నమ్మకం, విశ్వాసం, గౌరవం లేవు. చంద్రబాబునాయుడు శరవేగంగా సెక్రటేరియేట్, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు అన్ని సౌకర్యలతో భవనాలు కడితే రాజధాని ఏమీ లేదు అంతా గ్రాఫిక్ అని మాట్లాడుతారా?
ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నాయకులు కోర్టు ను ఆశ్రయించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఎంతసేపు విశాఖను దోచుకుందామనే ఆలోచన తప్ప మరొకటి లేదు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. జగన్ కు చట్టసభలంటే గౌరవం ఏకోశాన లేదు, ఉంటే అమరావతి రాజధానికి కట్టుబడి ఉండేవారు. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు చంద్రబాబు నాయుడు తన హయాంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేడు జగన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీ పాలన సాగిస్తామంటే ప్రజలు ఒప్పుకోరు.
తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటికి రాని జగన్ కు ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు అమరావతి రాజధానిని ఏర్పాటు చేయదలిస్తే జగన్ మూడు రాజధానులంటూ ముక్కల ఆట ఆడుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. తాపీ మేస్త్తీలకు పనిలేదు, చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవు. పది వేల కోట్లతో విశాఖను రాజధాని చేస్తామంటున్నారు.
రంగులు వేయడానికి పదివేల కోట్లు సరిపోతాయి. పది బిల్డింగులు విశాఖలో కడితే, రంగులు వేస్తే ఆదాయంరాదు. సంపద సృష్టించాలి. రైతులు ఏం నేరం చేశారని వారిని ఇబ్బందిపాలు చేస్తున్నారు? రాష్ట్రంలో పోలీసు జులుం అధికమైంది. జగన్ లో మార్పు రావాలి. రాజధానికి భూములు ఇచ్చి భాధపడాల్సి వస్తోంది. గ్రామాల ప్రజలు స్పందించాలి. వైసీపీపై పోరాడాలి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. వైసీపీ నాయకులకు బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడా గంపెడు మట్టి వేసి రోడ్లు పూడ్చిందిలేదు.
97 శాతం వాగ్దానాలు పూర్తి చేశామని ఉత్తుత్తి మాటలు చెబుతున్నారు. ఏమేం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇంతటి దరిద్రపు పరిపాలన నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కనడం మానండి. ప్రజలు వైసీపీ నాయకులను ఇంటికి సాగనంపడానికి ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు.