కాషాయం ఈ మట్టి సొంత రంగు. కాషాయం ఈ గడ్డ రంగు. కాషాయం భారతప్రదేశపు రంగు.
అవునా? కాదా? మతి భ్రష్టుపట్టకపోతే, చరిత్ర సరిగ్గా తెలిస్తే , చదవడం అన్నది ఏ కాస్తైనా ఉండి ఉంటే కాషాయం మన రంగు అన్న జ్ఞానం ఉంటుంది. మనం కాషాయం రంగు వాళ్లమే. కాదనుకోవడం ఆత్మవంచన అవుతుంది. కాదనడం నీతిలేనిదవుతుంది.
ఆలోచిద్దాం-
ఇతర రంగులు మన భూభాగంలోకి ఎప్పుడు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఆ ఇతర రంగులు మనలో చొరబడి మనకెంత హానిచేశాయి?
కాషాయం తప్పితే ఇతర ఉన్మాదపు రంగులు లేని మన ప్రదేశంలోకి దశల వారీగా ఇతర రంగులు వచ్చాయి. ఇది చారిత్రిక వాస్తవం. ఆ రంగులు ఎలా వచ్చాయి? చరిత్ర చదివిన ఎవరికైనా తెలిసిన విషయమే. క్రూరత్వంతో వచ్చాయి. మోసంతో వచ్చాయి. వెన్నుపోట్లతో వచ్చాయి. మతోన్మాదంతో వచ్చాయి. మన సంపదను కొల్లగొట్టడం కోసం వచ్చాయి. కొల్లగొట్టాయి. (ఈ విషయాన్ని నిరూపిస్తూ విదేశీ పరిశీలకులు వ్రాసిన 20 పుస్తకాల జాబితా ఇవ్వగలను)
ఇదీ చారిత్రిక వాస్తవమే. వచ్చి మన స్త్రీల మాన, ప్రాణాల్ని కబళించాయి. ఈ గడ్డపై నరమేధం చేశాయి. ఈ నేల నెమ్మదిని నాశనం చేశాయి. ఇక్కడి సంస్కృతిని, స్వస్థతను చెఱిపేశాయి. ఈ మట్టి మనుషుల జీవనాల్ని అల్లకల్లోలం చేశాయి. విదేశాల రంగులు ఇంకా, ఇప్పటికీ ఇక్కడి జన జీవితాలకు నిప్పంటిస్తూనే ఉన్నాయి!
కాషాయం ఇతర రంగులలా దురాక్రమణలు చెయ్యలేదు. ఇతరుల సంపదల్ని కొల్లగొట్టలేదు. ఇతర దేశాల స్త్రీల మాన ప్రాణాల్ని హరించలేదు. ఏ ప్రదేశాన్నీ , ఈ ప్రపంచాన్నీ సాంఘీకంగా, రాజకీయంగా కలుషితం చెయ్యలేదు. కాషాయం తన మానాన తన ప్రదేశంలో తానున్నది; అంతే. ఇదీ చారిత్రిక వాస్తవమే.
ఈ దేశంలో ఇతర రంగుల్ని పూసుకున్న వాళ్ల చరిత్ర ఏంటి? వాళ్లకు ఆ రంగులు ఎలా వచ్చాయి? గతి మారాక, స్థితి మారాక వాళ్లు వేఱే రంగుల్ని పులుముకున్నారు. వీళ్ల మూలాలు ఏంటి? నిజాల్ని వదులుకున్నాక వాళ్లు వేఱే రంగుల వాళ్లయ్యారు. ఈ మట్టి రంగుకు చెందిన వాళ్లు తమ రంగును కాదనుకుని ఇంకేదో రంగు పూసుకుని అబద్ధపు బతుకు బతుకుతున్నారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రదేశంలో ఉంటున్న విదేశాల రంగుల వాళ్లు కూడా తరతరాల వాసం వల్ల పుట్టుకతో ఈ దేశపు రంగులోనే పుట్టిన వాళ్లవుతారు.
అయ్యలారా, అమ్మలారా, కాషాయమూక అని అనడం ఎంత కుసంస్కారం? ఆలోచించండి. మీ మూలాలు ఏవి? ఈ గడ్డపై తరతరాలుగా ఉంటూ చదువు, సంస్కారమూ లేకుండా ఈ గడ్డ రంగును తూలనాడడం సంస్కారమా? సరైనదేనా?
ఇతర రంగులు ఈ భారతానికీ, ప్రపంచానికీ చేసిన కీడు, నష్టం , విధ్వంసం, కలుషితం, మానహాని, ప్రాణహాని కాషాయం చెయ్యలేదు. చారిత్రికస్పృహ ఉన్న ఎవరికైనా ఇది తెలిసిన సత్యమే.
ఈ గడ్డ ఇంకా ముక్కలు కావాలనీ, విదేశీ మతోన్మాదపు రంగులకు కావాల్సిన లబ్ది జరగాలనీ కాషాయాన్ని కాల్చేయాలనుకోవడం సరికాదు. కాషాయాన్ని తూలనాడడమూ సరికాదు. అబద్ధపు బతుకుతో ఎన్నయినా అనచ్చు. వాస్తవాలకు విరుద్ధంగా మీ వికారాన్ని ఇలా ఈ మట్టిపై వాంతి చెయ్యకండి. ఈ మట్టిని విషపూరితం చెయ్యకండి.
కాషాయం ఈ మట్టి రంగు. మా ఈ భారతప్రదేశపు రంగు. మీకు వాస్తవాలు అక్కఱ్లేక పోవచ్చు. మాకు కావాలి. ఎందుకంటే మేం దేశద్రోహులం కాం; మేం సంఘద్వేషుల కాం. మేం ఈ మట్టి పాట పాడుకుంటూంటాం.
విదేశాల రంగుల ఉన్మాదుల్లారా మీ ఉన్మాదంతో, మీ ఉన్మాదపు మేధతో దేశద్రోహులవకండి. ఈ మట్టిని, మమ్మల్ని బాధించకండి.
“భారతం.. ఒక సత్ ప్రదేశం;
భారతం.. ఇది ఒక సందేశం”

9444012279