Suryaa.co.in

Andhra Pradesh

కడప రవాణా శాఖలో కీచక అధికారిపై వేటు!

– విచారణకు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ఆదేశం

కడప : కడప రవాణా శాఖలో కీచక అధికారిపై వేటు పడింది. ఈ మేరకు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు అండగా ఉంటామన్నారు. రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు మంత్రి హితవు పలికారు.

ఉన్నత అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆ ఉన్నత అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేశామని, ఒక సీనియర్ అధికారి ద్వారా సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి మీడియాకు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి సంఘటనలను ఉపేక్షించదని హెచ్చరించారు.

LEAVE A RESPONSE