Suryaa.co.in

Andhra Pradesh

ఇఫ్తార్ విందులో పాల్గొన్న అర్జున్ రెడ్డి

– ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు
– బుచ్చిరెడ్డి పాళెం పెద్ద మసీదులో ఇమామ్, మౌజన్లకు రంజాన్ తోఫా కిట్ల పంపిణి చేసిన అర్జున్ రెడ్డి

కోవూరు: రంజాన్ అంటే శాంతి సహనాలకు ప్రతీకగా అభివర్ణించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమారులు అర్జున్ రెడ్డి . ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు బుచ్చి పట్టణంలోని పెద్ద మసీదుకు విచ్చేసిన అర్జున్ రెడ్డి కి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఉపవవాస దీక్ష విరమణలో పాల్గొన్నారు. అనంతరం మసీదు ఇమాము మరియు మౌజన్లకు రంజాన్ తోఫా కిట్లు అందచేశారు. ఈ సందర్బంగా ముస్లిం మత గురువులు అర్జున్కి ఆశీర్వచనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి మైనారిటి నాయకులు షబ్బీర్, మహబూబ్ బాషా, సందాని, కౌన్సిలర్ రహమాత్, ఫిరోజ్, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బత్తుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE