Suryaa.co.in

Andhra Pradesh

అధికారుల విధులకు ఆటంకం కలిగించి తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడి అరెస్ట్

ధర్మవరం పోలీసులు శనివారం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శివ జ్యోతి నగర్ లోని నందిని అపార్ట్మెంట్స్ రహస్యంగా తలదాచుకుంటున్న ఈ నేరస్తుడిని అలిపిరి పోలీసుల సహాయంతో అరెస్టు చేయడం జరిగింది.

ఇతని పేరు మేడా లోకేష్. ఇతను అనంతపురం జిల్లా ధర్మవరంకి చెందిన వ్యక్తి. 2017 లో ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఇతనిపై భూకబ్జా కేసులు నమోదయింది. అప్పటి నుంచి క్రిమినల్ యాటిట్యూడ్ కలిగిన ఈ వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.పైగా అయిన దానికి, కాని దానికి మిడిమిడి జ్ఞానంతో యావత్ న్యాయవ్యవస్థని, కార్యనిర్వాహక వ్యవస్థని, పోలీసు వ్యవస్థను త్రునీకరించి, హేళన చేస్తూ, కించపరిచే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక వ్యసనంగా మారింది.

నేర ప్రవృత్తి కలిగిన ఇతని ఆలోచన ధోరణి ఆ నేరాన్ని ప్రశ్నించే వ్యవస్థపై ఈయన కుట్ర కోణం, భేదిరింపు సహజ లక్షణాలు కలిగి ఉండటం ఈ వీడియో ద్వారా ప్రస్ఫుటంగా బయటపడుతోంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న ఇతనిపై ధర్మవరపు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.

మేడ లోకేష్ పై 2017 లో ల్యాండ్, గ్రాబింగ్, పోలీసులు, ప్రజాప్రతినిధులపై అనుచిత వాక్యాలు చేసిన వ్యక్తి పైన కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 256 కింద 341, 353, 506, 510 ఐపీసీ సెక్షన్ ల కింద ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది. వారెంట్ కనుగుణంగా నేరస్తుడి వివరాలు తెలుసుకుంటూ తిరుపతి చేరుకున్న ధర్మవరం పోలీసు బృందం అలిపిరి పోలీసుల సహాయంతో అరెస్టు చేయడం జరిగింది.

ఇటీవల సి.ఆర్.పి.ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు పోలీసు వ్యవస్థ పట్ల వ్యక్తం చేసిన వ్యక్తిగత అభిప్రాయ వీడియోను మార్ఫింగ్ చేసి, సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న పోలీస్ అధికారులను అగౌరవ పరిచే విధంగా వైరల్ చేసాడు.

LEAVE A RESPONSE