Suryaa.co.in

Andhra Pradesh

ఆశల నివేదన కాదది.. అద్భుత ఆత్మస్థైర్య అభివృద్ధి ఆకాంక్ష

– అబ్బురపడిన ఆర్థిక సంఘ బృందం

ఈ దృశ్యం చూస్తుంటే 16వ ఆర్థిక సంఘ బృందం మన ప్రణాళికలు చూసి ముగ్దులవుతూ.. మనకు వున్న ఇబ్బందులలోనూ చూపుతున్న ఆత్మవిశ్వాసానికి అచ్చెరువొందుతూ.. సాయం చేస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్దత, వాణిజ్య వృద్ధిలో మందగమనం వంటి వాటిని దేశం అధిగమించేలా చేసే సానబట్టాల్సిన వజ్రం ఈ ఆంధ్రా అనే భావనకు వచ్చినట్లు అనిపించింది.

తమ బృందానికి సాదరంగా స్వాగతం పలికిన నాయుడు, లోనకు తీసుకెళ్లి సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి నుండి దేశం కూడా ఆశ్చర్యపోయే పోలవరం-బనకచర్ల అనుసంధానం వరకు నాయుడు చూపిన ఆలోచనలకు, వాటికి ఇస్తున్న రూపాలకు ప్రశంసలు కురిపించారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఎంతో ఆశ్చర్య పరిచిందని, వృద్ధి గణాంకాలపై ఇంత లోతుగా విశ్లేషించడం, కేంద్ర సాయం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను పనగారియా ప్రశంసించారు.

మరోవైపు 30 ఏళ్ల క్రితం తాను హైదరాబాద్ వెళ్లిన నాటికి… నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ఆర్ధిక సంఘం సభ్యురాలు అన్నెజార్జ్ మాథ్యూ అన్నారు. అమరావతి కూడా అదే స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

అరవింద్ పనగారియా ప్రముఖ భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా ఉన్నారు, వీరి సిఫార్సులు 2026-31 మధ్య అమల్లో ఉంటాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్తగా సేవలందించారు. ఆర్థిక శాస్త్రంలో విశేష కృషికి 2012లో పద్మభూషణ్ అందుకున్నారు.

నలంద విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా కొనసాగుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత రచనలు చేశారు, “ఇండియా: ది ఎమర్జింగ్ జెయింట్” ఆయన ముఖ్యమైన రచన. రాజస్థాన్‌లోని భిల్వారా ఆయన స్వస్థలం. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా పనిచేశారు.

అలాంటి ఆయన లోన ఆలోచిస్తున్నట్లు చూపిన హావభావాలు, బయటకు వస్తున్నప్పుడు నాయుడి ప్రక్కన విద్యార్థిలెక్కన అనిపించారు. 16వ ఆర్థిక సంఘ బృందంలా కాకుండా ఒక అర్థిక వేత్త తరగతి గది నుండి వచ్చినట్లు కనిపించారు.

కేంద్రం గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసులు చెయ్యమని నాయుడు కోరినవి:
పోలవరం-బనకచర్ల అనుసంధానం|తాగునీటి ప్రాజెక్టులు|పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం)|ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంబర్| బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం|విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు|నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్|100 శాతం అక్షరాస్యత|పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు|ఇన్‌ల్యాండ్ వాటర్ వేలు, రహదారులు|అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజనల్ గ్రోత్ సెంటర్లు లాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసులు చేయాలని ఆర్ధిక సంఘాన్ని ముఖ్యమంత్రి కోరారు.

మన ఆలోచనకు అందని ఈ దార్శనికుడు ఆంధ్రా అదృష్టం. ఈయన ఆలోచనలు భవిష్యత్తులో సాక్షాత్కారం అవుతుందనే సత్యం తెలిసినా.. ఎన్నో అర్థం కాని నవ్వులకు నొచ్చుకోకుండా.. మనసులో జాలిపడుతూ.. మరింత బాగా అర్థం అయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తాడేమో నాయుడు!

LEAVE A RESPONSE