– సీపీఐ నేతల హెచ్చరిక
పత్తికొండ: స్మార్టుమీటర్ల విషయంలో గతంలో చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన పిలుపును ఇప్పుడు పాటిస్తామని సీపీం నేతలు స్పష్టం చేశారు. విపక్షంలో ఉండగా స్మార్టు మీటర్లను ధ్వంసం చేయాలన్న చంద్రబాబు-లోకేష్ పిలుపును ఇప్పుడు ప్రజలు అమలుచేయాలని వారు సూచించారు.
విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని చూస్తే వాటిని ధ్వంసం చేస్తామని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు, లోకేశ్ అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి,అధికారంలోకి రాగానే చార్జీలను పెంచడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టిన సీపీఐ నాయకులపై కేసులు నమోదయ్యారని, కోర్టు వాయిదాలకు తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.