Suryaa.co.in

Political News

బాబూ.. చుట్టాలొస్తున్నారు జాగ్రత్త

( సందీప్)

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్ల‌య్యింది. టిడిపి మండ‌ల కార్యాల‌యం నుంచి కేంద్ర కార్యాల‌యం వ‌ర‌కూ జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతూనే వున్నాయి. చంద్ర‌బాబు ఎటువెళ్లినా జ‌న‌సంద్ర‌మ‌వుతోంది. మూడేళ్ల జ‌గ‌న్ మోజు తీరిపోయిన నేత‌లు..సినీతార‌లు చంద్రుని చ‌ల్ల‌ని వెన్నెల త‌మ‌పై కుర‌వాల‌ని30-years-prudhvi-janasena త‌హ‌త‌హ‌లాడుతున్నారు. మొన్న‌నే థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ చంద్ర‌బాబుకి బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అవ‌కాశం దొరికితే చంద్ర‌బాబునే క‌లిసి పాదాల‌పై ప‌డి వైసీపీ ఉగ్ర‌వాద శిబిర శిక్ష‌ణ‌లో చేసిన పాపాల‌కు ప్రాయ‌శ్చిత్తం చేసుకుంటాన‌న్నాడు.

Mohan-Babu-Chandrababu-396x355రాజ‌కీయ పార్టీ అధినేతలతో మంచిగా వుంటూ, ముంచేసే మంచు మోహ‌న్‌బాబు త‌న క‌లెక్ష‌న్ కింగ్ బుద్ధి 2019 ఎన్నిక‌ల‌కి ముందు చూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తూ, ఎన్నిక‌ల‌కి ముందు ఫీజు రీయింబ‌ర్స్మెంట్ ముసుగులో రోడ్డెక్కి నానా యాగీ చేశారు. జ‌గ‌న్‌రెడ్డితో బంధుత్వం వుందంటూ మిడిసిప‌డిన మంచు కుటుంబం.. మారుమ‌న‌సు పొందిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. సాయిబాబా ఆల‌య ప్ర‌తిష్ట‌కి ఆహ్వానించే పేరుతో చంద్ర‌బాబు ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిశారు మోహ‌న్‌బాబు.

ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా తెలుగుదేశం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్‌రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లికిన ఒక్కో వ‌ర్గం గుర్తించి, ముంద‌స్తుగా చంద్ర‌బాబు ఆశీస్సుల కోసం వ‌స్తున్న‌ట్టు సామాన్యుల‌కి సైతం అర్థం అవుతోంది. మ‌రోవైపు టిడిపి నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్‌కి, వైసీపీ క్యాంప్ భారీ ఎర్త్ పెట్టేసింది. సీతంరాజు సుధాక‌ర్‌ని వ‌చ్చే ఎన్నిక‌ల‌కి సిద్ధంగా వుండాల‌ని చెప్పేసి, ఉత్తుత్తి ఇన్‌చార్జిగా వాసుప‌ల్లిని ఉంచేసింది. గ‌న్న‌వ‌రంలోనూ వంశీపైకి దుట్టా, యార్ల‌గ‌డ్డ గ్రూపులు తాడేప‌ల్లి ప్యాలెస్ అండ‌తో రెచ్చిపోతున్నారు. ఆరోగ్యం బాగాలేద‌నే కార‌ణంతో నెల‌లుగా హైద‌రాబాద్‌లో వుంటోన్న ప‌శువు డాక్ట‌ర్ వంశీ.. తెలుగుదేశం పెద్ద‌ల‌ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని స‌మాచారం.

అయితే టిడిపిలో ఏ ఒక్క‌రు కూడా వంశీ అనే పేరు త‌లిచినా అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. మ‌రోవైపు దాడి వీర‌భ‌ద్ర‌రావు, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి, శివారెడ్డి, కొంద‌రు వైసీపీ ఎంపీలు కూడాganta తెలుగుదేశం పార్టీ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపుల్లో వున్నార‌ని స‌మాచారం. టిడిపి నుంచి గెలిచి పార్టీతో అంటీముట్ట‌న‌ట్టున్న గంటా శ్రీనివాస‌రావు కూడా, టిడిపి అధినేత‌తో భేటీ అయి ఇక‌పై యాక్టివ్‌గా వుంటాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది.

మొత్తానికి జంపింగ్ జ‌పాంగ్‌లు, అధికారం ఎక్క‌డుంటే అక్క‌డ వాలే ప‌క్షుల‌న్నీ టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయమ‌ని గ్ర‌హించేశాయి. మెత‌క మ‌న‌స్త‌త్వం వున్న చంద్ర‌బాబు క్ష‌మించేస్తార‌ని, తాము పార్టీకి చేసిన ద్రోహం మ‌రిచిపోతార‌ని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి న‌ష్టం చేసిన వారి జాబితా త‌యారుచేసుకుని మ‌రీ, పార్టీ అధినేత నుంచి కార్య‌క‌ర్త వ‌ర‌కూ వ‌డ్డీతో స‌హా చెల్లించేందుకు సిద్ధంగా వున్నారు. బెల్లం చుట్టూ ఈగ‌ల్లాంటి మోసం బాబులు ఎత్తులు ఈ సారికి పార‌క‌పోవ‌చ్చు..

LEAVE A RESPONSE