స్థానిక సమస్యలపై బీజేపీ సమరం

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో 9వ రోజు జరుగుతున్న బిజెపి విజయ సంకల్ప పాదయాత్ర సాయిబాబా రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమై సుగాలి కాలనీ, వైశ్య బ్యాంక్ కాలనీ, విద్యానగర్ వరకు సాగింది.

వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అడిగి తేలుసు కుంటున్నాము. బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో స్థానిక సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.సాయిబాబా రోడ్ లో నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ, చెత్త దారుణంగా పేరుకుపోయింది. కనీస అవసరాలు అయినటువంటి త్రాగునీరు కనీసం అయినటువంటి చెత్త నిర్మూలన చేయరు. కానీ చెత్త మీద డబ్బులు వసూలు చేస్తూ దేశంలో ఎవరూ చేయని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది.

వైసీపీ ప్రభుత్వం 5సం. ల పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరుతో ప్రచారం సాగించడం విడ్డురంగా ఉంది.పేద, బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రహదారులకు నిర్మాణాలకు భారీ ఎత్తుననిధులు మంజూరు చేయడం జరిగింది.రాష్ట్రంలో రైల్వే స్టేషన్స్అభివృద్ధి కోసం3887.4కోట్లనిధుల అంచనాలతో405 కిలోమీటర్ల రైల్వే లైన్స్ అభివృద్ధి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజనలో 4,22,482 రైతులకు లబ్ది చేకూర్చిన ఘనత బీజేపీ కి దక్కింది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అల్ ఇండియా మెడికల్ సైన్స్ నిర్మాణంచేసి ప్రజా సేవకు అంకితం చేసిన ఘనత నరేంద్రమోదీ ది. భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి దిశలో పయనిస్తుంటే, ఈ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మాత్రం తిరోగమనంలో పయనిస్తుంది.రాబోవు ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, శనక్కాయల అరుణ, మాగంటి సుధాకర్ యాదవ్, పాలపాటి రవికుమార్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, మండల నాయకులు స్టాలిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, నాగమల్లేశ్వరి యాదవ్, శ్రీ కళ్యాణి, లక్ష్మీ ప్రసన్న, సంఘం మహాలక్ష్మి, అనుపమ బిందు, జి నాగమల్లేశ్వరి, శివ పార్వతి, మౌనిక, కే.నాగమల్లేశ్వరి, వాణి వెంకట్, మంత్రి సుగుణ, ఏలూరి లక్ష్మి, సరోజిని, తోట శ్రీనివాసరావు, రేణుకాదేవి, కొక్కెర శ్రీనివాస్, తానుచింతల అనిల్, రాయపూడి ఏసోబు, వెంకటేష్ యాదవ్, నరసింహారావు, తాడువాయి రామకృష్ణ, అప్పిశెట్టి రంగారావు, రాచుమల్లు భాస్కర్, అంకరాజు నరసింహమూర్తి, ఏడుకొండలు గౌడ్, పెద్దింటి కృష్ణ చైతన్య, చింతపల్లి వెంకట్, మాదాల సురేష్, జితేంద్రగుప్త, యమ్మాజీ హనుమంతరావు, దేసు సత్యనారాయణ, తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply