తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు

వడ్డెరల ఆరాధ్య దైవం వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. బ్రిటీషు వారిని వణికించిన ఉయ్యాలావాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా చూపిన తెగువ అచంచలమైనదని కొనియాడారు. నమ్మి బాధ్యతలు అప్పగిస్తే ఎలా పని చేయాలో చాటి చెప్పిన మహనీయుడు ఓబన్న అన్నారు.

బ్రిటీషు వారి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ప్రజలు, రాజ్యాలు, రాజులు ఉన్న సమయంలో మిత్రుడు, రాజు నరసింహారెడ్డి చెప్పిన మాటకు ఏకంగా బ్రిటీష్ అధికారి తల నరికి బహుమతిగా ఇచ్చిన ధీశాలికి నివాళులర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డే వెంకట్, గుంటూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వేముల కొండ శ్రీనివాస్, బీసీ సాధికార సమితి జోన్-3 కో ఆర్డినేటర్ రమాదేవి, జోన్-5 కోఆర్డినేటర్ నరసింహులు ఇతర బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply