Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరోధించడం కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం

– మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరోధించడం కూటమి ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, 7. 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో, లక్షకు పైగా ప్రజలకు ఉపాధి అందిస్తూ, 22 వేల ఎకరాలలో నిర్మించిన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఈ ఉద్యమంలో 30 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు.

విశాఖ ఉక్కు ఉద్యమం ఆ రోజుల్లో అతి పెద్ద ఉద్యమమమన్నారు. 1992 లో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం దేశ ఆర్ధిక ప్రగతికి ఎంతగానో టోల్డ్కతోందన్నారు. ఎంతో గొప్ప టెక్నాలజీ తో, నైపుణ్యం కలిగిన కార్మికులతో ప్రగతిపధంలో నడిచిన విశాఖ ఉక్కు ను కేంద్రప్రభుత్వంలో ఎకనామిక్ అఫైర్స్ కమిటీ నష్టం వస్తున్నదన్న కారణంతో నూరుశాతం ఈక్విటీ షేర్లు ఉపసంహరణకు ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, విశాఖ ఉక్కు కార్మికులు వ్యతిరేకించారన్నారు.

విశాఖ ఉక్కు ఉద్యోగులు 1500 రోజులపాటు చేసిన ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కారణంగా లక్ష ఉద్యోగ కుటుంబాలు రోడ్డున పడతాయని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం విరమించుకోకుంటే సదరు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడపాలని 2021లో లోకేష్ ఉద్యమం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పర్లియామెంట్లో 22 ఎంపీల బలమున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికి, ఎన్నో సార్లు ఢిల్లీ పర్యటనలు చేసి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తమ స్వంత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్నారు.

గత 6 నెలల్లో ముఖ్జ్యమంత్రి విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం నిర్యాణాన్ని పునరాలోచించాలన్న విషయంపై ప్రధానమంత్రి, హోమ్ మంత్రి, ఉక్కు పరిశ్రమల మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి విజయం సాధించి 11 వేల 400 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజి ని సాధించారన్నారు. అంతేకాక అమరావతి నిర్మాణానికి కూడా 31 వేల కోట్ల రూపాయలు సాధించారని, వాటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరుగులెత్తించడంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి 12 వేల 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వం నమ్మకానికి తార్కాణమన్నారు.

రాష్ట్ర ప్రజలపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనా దక్షతపై నమ్మకంతో ఇటీవల విశాఖపట్టణంలో 2 . 08 లక్షల కోట్ల రూపాయల పెట్టుబాటులతో వివిధ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంఖుస్థాపనలు చేయడం , పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్యమని ప్రధానమంత్రి నమ్మకానికి తర్ఖనమన్నారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ సమయంలో ఆర్ధిక విధ్వంసానికి పాల్పడిందని, కేంద్ర ప్రభూత్వముతో రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడకుండా తమ స్వంత ప్రయోజనాలకోసం పాటుపడిందన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి, 11 వేల 400 కోట్ల రూపాయల ప్రత్యేక అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ , హోమ్ మంత్రి అమిత్ షా, ఉక్కు శాఖ మంత్రికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాక్రిష్నయ్య (చంటి), ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ప్రభృతులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE