Suryaa.co.in

Andhra Pradesh

అసంపూర్తిగా మిగిలిన అంబేడ్కర్ స్పృతివనం పనులను త్వరలోనే పూర్తి చేస్తాం

• స్పృతివనం పనులను వంద శాతం పూర్తి చేస్తాం
• స్మృతి వనం పనులు పూర్తికాకుండానే ప్రారంభించి ప్రజలను మోసగించారు
– డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

అమరావతి : అంబేడ్కర్ స్పృతివనం నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం మంత్రి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం ను సందర్శించి, మిగిలిపోయిన నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ…. నవ్యాంధ్ర రాజధానిలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత టిడిపి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందుకనుగుణంగా అమరావతిలో స్థలం కేటాయించి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో గత ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి, విజయవాడలో ఏర్పాటు చేసిందన్నారు.

పనులు పూర్తిగా పూర్తికాకముందే ప్రారంభం చేసి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

LEAVE A RESPONSE