Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల పుట్టినరోజు వేడుకలు

– మంత్రి కొడాలి నాని, గొర్ల శ్రీను లకు గజమాలతో సత్కారం గుడివాడ , సెప్టెంబర్ 2 : రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి . గురువారం…

వైఎస్సార్ చూపిన మార్గంలోనే ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం జగన్

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి గుడివాడ , సెప్టెంబర్ 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే సీఎం జగన్మోహనరెడ్డి పయనిస్తూ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి…

రూ. 10. 70 కోట్ల నిధులతో ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : రూ . 10.70 కోట్ల నిధులతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గురువారం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న…

భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

– గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం – ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్యం అందించేందుకు గుడివాడకు మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల…

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– పూర్ణకుంభ స్వాగతం , శిలాఫలకం ఆవిష్కరణ గుడివాడ , సెప్టెంబర్ 2 : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్ప లీలావతి , శ్రీ అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందజేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి…

గొప్ప మానవతావాది, మహా మనిషి డా. వైయస్ఆర్: సజ్జల

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా|| వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి సందర్భంగా నేతల ఘన నివాళి ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ర్ట మంత్రులు డా|| సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా||…

రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంటే విజయమ్మకు, షర్మిలకు బాధ్యతలేదా?

• ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు • మరిప్పుడు, తన బిడ్డ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న జగన్ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని నేడు తాను డిమాండ్ చేస్తున్నా • గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని…

పోలీసులు చేయి చేసుకోవడం దుర్మార్గం

టీడీపీ మహిళా నేతలు, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు  -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు, పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు…

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు,…

అన్న‌మ‌య్య భ‌వ‌న్ హోట‌ల్ బ‌కాయి వ‌సూలుపై వివ‌ర‌ణ‌

ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్య‌మాల్లో తిరుమలలోని అన్నమయ్య భవన్ హోటల్ నిర్వాహకులకు టిటిడి అధికారులు సహకరించి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లేలా చేశారని, బెంగళూరులోని ఒక సంస్థకు సదరు హోటల్‌ను కేటాయించడానికి, క్రమంగా తిరుమలలోని అన్ని హోటళ్లను సదరు సంస్థకు కేటాయించేలా తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సత్యదూరమైన, నిరాధారమైన చౌక‌బారు ఆరోపణలు…