– హైకోర్టులో కేఏ పాల్ పిల్
– పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫోటోలు
– ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదు
– పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ హత్య
అమరావతి : ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను హైకోర్టు విచారించింది. ప్రవీణ్ ను హత్య చేసి చంపేశారని పిటిషన్ లో కేఏ పాల్ ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ తన వాదనలు వినిపించారు.
పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలని పాల్ వాదించారు. మృతి ఘటనపై ఎవరూ మాట్లడవద్దని ఎస్పీ అందరినీ బెదిరించారని, ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదని అన్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికీ ఇవ్వలేదని పాల్ చెప్పారు.