Suryaa.co.in

Andhra Pradesh

అవును.. ఇది అసామాన్యమే!

2025 ఆర్ధిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు సాధించిన దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లో… 351 ప్రాజెక్టులు ₹ 3,06,653.14 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ టాప్ 5 లో నిలిచింది.

2025 సంవత్సరం ఆర్ధిక వృద్దిరేటులో దేశంలో నెం.1 గా నిలిచిన తమిళనాడు టాప్ 10లో లేకపోవడం గమనార్హం. అలాగే… మనకంటే ఎక్కువగా 586 ప్రాజెక్టులు సాధించినా కూడా, ₹ 1,75,311.60 కోట్లతో తెలంగాణ 9 వ ప్లేస్ లో ఉండడం గమనార్హం.

అతిపెద్ద పెట్టుబడి ₹ 91,528 కోట్ల వేదాంత ప్రాజెక్ట్ సాధించిన రాష్ట్రంగా ఒడిస్సా కాగా… రెండవ అతిపెద్ద పెట్టుబడి ₹ 70,000 కోట్ల ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ప్రాజెక్ట్ సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

గత 5 ఏళ్ళూ రాష్ట్రం నుంచి పరిశ్రమలూ, కంపెనీలూ వెళ్లిపోతుంటే నిస్సహాయంగా, నిర్వేదంగా కళ్ళప్పగించి చూసిన మనకు… సామాన్య ప్రజలకు ఇవన్నీ అక్కర్లేని అంశం అయినా… రాష్ట్రం బాగుండాలని, అభివృద్దిలో దూసుకు వెళ్లాలని టీడీపీకి ఓటు వేసిన నాలాంటి వాళ్లకు మాత్రం.. ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే అంశాలు ఇవన్నీ.

-మల్లిన రాధాకృష్ణ
తణుకు

LEAVE A RESPONSE