Suryaa.co.in

Andhra Pradesh

అలా చేయాలని చూస్తే సచివాలయం వద్ద చీపుళ్ళ తో నిరసన తెలుపుతాం

-రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు పని లేకుండా చేయాలని చూస్తే ,రాష్ట్ర సచివాలయం వద్ద చీపుళ్ళ తో నిరసన తెలుపుతాం
-సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ బాబురావు హెచ్చరిక

ఆదివారం సాయంత్రం మండల కేంద్రమైన తుళ్లూరులో రాజధాని లోని 29 గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు తమను జనవరి నుండి పారిశుద్ధ్య పనిలో కొనసాగించాలని… తొలగిస్తే చూస్తూ ఊరుకోమని తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు మద్దతు తెలుపుతూ ర్యాలీలోపాల్గొన్న బాబురావు మాట్లాడుతూ……….

రాజధాని పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి. జనవరి నుండి కార్మికులకు పనిలేదని అధికారులు చెబుతున్నారు. రాజధానిలో రోడ్లు ఊడ్చే పని లేకుండా చేసి రాజధాని గ్రామాలను మురికి కూపంగా మార్చాలని చూస్తున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. క్యాబినెట్ సమావేశంలో రాజధాని లోపారిశుధ్యం, కార్మికుల పని గురించి చర్చించాలి. గడపగడపకి ఎమ్మెల్యేలు తిరగటం ఏమో కానీ, ఆఫీస్ ఆఫీసుకి పారిశుద్ధ్య కార్మికులు మాకు జీతాలు ఇవ్వండి బాబు అని తిరగాల్సిన దుస్థితి పట్టింది. విజయవాడ సి ఆర్ డి ఏ కార్యాలయం ఎదుట కార్మికుల బొచ్చె లు పట్టుకొని భిక్షాటన చేసిన ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదు.

రాజధాని లోని కార్మికులకు జీతాలు ఇవ్వకుండా రోడ్డు ఎక్కించి వాళ్ల కడుపులు మలమల మాడేటట్లుగా చేస్తున్నారు. సంక్షేమ రాజ్యం అంటే జీతాలు లేకుండా కార్మికులు కడుపులు కాల్చడమేనా? రాజధాని కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను, కలిసి వచ్చే వారిని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కార్మికుల కోసం న్యాయబద్ధంగా ఎంతటి పోరాటాల కైనా సిద్ధం. అరెస్టులకు జంకేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తుంది. కార్మికులకు జీతాలు చెల్లించుకుంటే వారు ఎలా బతుకుతారు. జీతాలు చెల్లించామని చెప్పి కార్మికులను మోసగిస్తారా నాలుగు నెలలుగా జీతాలు బకాయి ఉండి ఒక్క నెల జీతం వేసి చేతులు దులుపుకుంటారా?

జీతాలు చెల్లించని సుమిత్ కంపెనీ పై ప్రభుత్వం అధికారులుచర్యలు ఎందుకు తీసుకోవడం లేదు డిసెంబర్ 15 లోపల కార్మికులకు పెండింగ్ ఉన్న మూడు నెలల జీతాలు చెల్లించకపోతే రాష్ట్ర సచివాలయం వద్ద నిరసన తెలుపుతాం. ఈ ర్యాలీలో రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు రవి అధ్యక్షురాలు చెరుకూరి సుశీల సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి భాగ్యరాజు నాయకులు వి వెంకటేశ్వరరావు పేరం బాబురావు గ్రేసు బుజ్జి జ్యోతి శేషయ్య రామాంజనేయులు వీరాంజనేయులు ముత్యాలు రత్నకుమారి ఆదిలక్ష్మి నాగమణి సత్యవతి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE