మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యతను కల్పించాల్సి ఉందని. ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవాళి మనుగడ సాధ్యమని గుర్తించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జి హెచ్ ఎం సీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో చేపట్టిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ గురువారం సీతాఫల్మండి లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మట్టి వినాయకులను బల్దియా అధికార యంత్రాంగం తయారు చేయించి ఉచితంగా అందించడం ఆనందకరమని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అన్ని మునిసిపల్ డివిజనల వార్డు కార్యాలయాల్లో మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచి అందిందాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా వినాయక చవితి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. కార్పొరేటర్ సామల హేమ, అధికారులు, యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, సమన్వయకర్త రాజా సుందర్, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీడ్ గణేష్ ఆవిష్కరణ
కాగా తెనాలి డబల్ హార్స్ మినుప గుండ్లు సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన సీడ్ గణేష్ పర్యావరణ అనుకూల వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. కార్పొరేటర్ సామల హేమ, బీ.ఆర్. ఎస్. సీనియర్ నేత గుండవేని రాజేష్ గౌడ్, సంస్థ తెలంగాణా రాష్ట్ర మార్కెటింగ్ అధికారి జి.ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.