అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో నిరూపించిన సీఎం జగన్మోహనరెడ్డి

– ప్రజలను నమ్మించవచ్చనే భ్రమలో బతుకుతున్నారు
– దశలవారీగా మద్య నిషేధం విధిస్తానన్న సీఎం జగన్
– 24 గంటల్లోనే 45 వేల బెల్ట్ షాపులను రద్దు చేశాం
– 6 వేల పర్మిట్ రూంలు, 2,600 వైనావులను తొలగించాం
– చంద్రబాబు రెన్యువల్ చేయడం వల్ల నడుస్తున్న బార్లు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి (అసెంబ్లీ), మార్చి 24: రాష్ట్రంలోకి కొత్త డిస్టలరీలు, పిచ్చి మద్యం బ్రాండ్లను ఎవరు తీసుకువచ్చారు, వాటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహనరెడ్డి సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కమిషన్లు తీసుకుని పార్టీని నడుపుతూ కుటుంబాల ఆస్థులను ఎవరు పెంచుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఆధారాలతో సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో తెలియజేశారన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులని, ఏం చెబితే అదే నమ్ముతారని అనుకుంటున్నారన్నారు. డబ్బా ఛానల్స్ లో గంటల తరబడి చర్చా కార్యక్రమాలను నిర్వహించి సొల్లు పురాణం చెబుతున్నారన్నారు. ప్రజలకు ఏది చెబితే అదే వింటారని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులతో కూడిన 420 బ్యాచ్ భావిస్తోందన్నారు. ఈ బ్యాచ్ కు నాయకుడు చంద్రబాబు అని అన్నారు. నలుగురితో డిబేట్లు, ప్రెస్మీట్లు పెట్టి ఏది చెప్పినా ప్రజలు వింటారని, నమ్మించవచ్చని పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారన్నారు. సారాయిని కూడా ఏరులై పారించిన చంద్రబాబు సీ బ్రాండ్స్, లోకేష్ ఎల్ బ్రాండ్స్ గురించి కూడా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వివరించడం జరిగిందన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం చేయాలో దిక్కుతోచక ప్రెస్మీట్లు పెట్టి మళ్ళీ రోజూ చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలే చెబుతున్నారన్నారు.

మద్య నిషేధం అని చెప్పిన సీఎం జగన్ దానిపై ఎందుకు మాట్లాడడం లేదని అంటున్నారన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టారన్నారు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను కూడా రద్దు చేస్తానని ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే రాష్ట్రంలో ఉన్న 45 వేల బెల్ట్ షాపులను ఏరిపారేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఆరు వేల వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంలు ఉండేవన్నారు. అక్కడ తాగుబోతులను కూర్చోబెట్టి రోడ్లపై మహిళలు, పిల్లలను నడవలేని పరిస్థితులను సృష్టించారన్నారు. బార్లను తలపించే విధంగా ఉన్న పర్మిట్ రూంలను సీఎం జగన్మోహనరెడ్డి పూర్తిగా రద్దు చేశారన్నారు. ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు పెట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిన నీచుడు చంద్రబాబు అని అన్నారు. అటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచన చేశారన్నారు. దీనిలో భాగంగా దాదాపు 6 వేల వైన్ షాపులను తొలగించి వాటి స్థానంలో ప్రభుత్వమే 3,400 వైన్ షాపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బార్లను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ళకు రెన్యువల్ చేశారంటూ బార్ల యజమానులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని నేటికీ నడుపుకుంటున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Leave a Reply