Suryaa.co.in

Telangana

సీఎం రేవంత్‌ రెడ్డికి తప్పిన ప్రమాదం

-పేలిన ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం టైరు
-తప్పిన ప్రమాదం..ఊపిరిపీల్చుకున్న అధికారులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్‌ క్రూజర్‌ వాహనం టైరు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన కలకలం రేపింది. సోమవారం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వెళుతుండగా వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. టైర్‌ పేలిందని తెలియడం తో అందరూ వాహనాల నుంచి బయటకువచ్చారు. భయాందోళనకు గురయ్యారు. అయితే వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. పేలిన టైర్లు మరమ్మతులు చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్‌కు బయలుదేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మొయినాబాద్‌ మీదుగా కొడంగల్‌ మీటింగ్‌కు బయలుదేరారు.

LEAVE A RESPONSE