Home » సూటి పెట్టి… లాగి కొట్టి

సూటి పెట్టి… లాగి కొట్టి

గోలీలు అడి.. పిల్ల‌ల‌తో పిల్లాడిలా మారిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

ప్ర‌జ‌ల‌తో ఇట్టే క‌లిసిపోయే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఈ రోజు చిన్న పిల్లాడిలా మారారు. పిల్ల‌ల‌తో క‌లిసి కొద్దిసేపు గోలీలు ఆడారు. సూటి పెట్టి లాగి గోలీని కొట్టి… పిల్ల‌ల చ‌ప్ప‌ట్లు, హ‌ర్ష‌ధ్వానాలు అందుకున్నారు. ఈ ఘ‌ట‌న జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, దేవ‌రుప్పుల మండ‌లం సింగ‌రాజుప‌ల్లిలో సోమ‌వారం జ‌రిగింది.

వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లి సింగ‌రాజుప‌ల్లిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. స్థానిక పాఠ‌శాల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఆ ఆవ‌ర‌ణ‌లో పిల్ల‌లు గోలీలు అడుతూ క‌నిపించారు. దీంతో ఎప్పుడో చిన్న‌ప్పుడు ఆడిన ఆట‌ను గుర్తు చేసుకుంటూ, పిల్ల‌ల్లో పిల్లాడిలా మారిపోయి… మంత్రి గోలీలు ఆడ‌టంతో… అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

పిల్ల‌లు సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. ఈ ఆట విడుపు చూసి… అవురా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంత్రి అయినా స‌రే, త‌న మూలాలు మ‌ర‌చిపోని మ‌హానేత అంటూ పొగిడారు. అనందంతో చప్ప‌ట్లు కొట్టి అభినందించారు.

Leave a Reply