-జిల్లా ఎన్నికల అధికారికి ఓటర్ల ఫిర్యాదు
-పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి
షేక్ పేట్‌లో ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. షేక్ పేట్ డివిజన్‌లో దాదాపు 3 వేల ఓట్లను డిలీట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు. అయితే ఇప్పుడు తొలగించారని చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరే కంగా అధికారులు ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపి స్తున్నారు. వారం కిందట ఓటరు స్లిప్పులను పంచారు. ఇప్పుడు జాబితాలో పేరు లేదం టూ వెనక్కి పంపారని తెలిపారు. అధికారులు కావాలనే ఓట్లను తొలగించారని, దీనిపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాని కి కూడా ఫిర్యాదు చేయనున్నామని వివరించారు.