Suryaa.co.in

Telangana

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌

-అబద్ధాల్లో కేసీఆర్‌ కుటుంబం, రేవంత్‌కు ఆస్కార్‌
-అందుకే ఆయన ప్రసంగాల్లో అసహనం
-ఎన్నికలకు ముందు రైతుబంధు ఎందుకివ్వలేదు
-తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తమకు అనుకూలంగా మారిందని, వారి ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారుప. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని వివరించారు. ఇందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలువబోతోందని, దీనిపై ఎటువంటి అనుమానాలు లేవన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు పదేళ్లు అవకాశమిచ్చారు. ఈసారి మెజారిటీ ఓట్లు, సీట్లు బీజేపీకే వేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చూసి కాంగ్రెస్‌ పార్టీలో కలవరం పెరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగాల్లో ఈ అసహనం కనబడుతోందన్నారు. ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులను జైలులో వేస్తే బుద్ధి వస్తుందన్న రేవంత్‌ రెడ్డి ప్రకటనలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

అబద్ధాల్లో కేసీఆర్‌ కుటుంబం, రేవంత్‌కు ఆస్కార్‌ ఇవ్వొచ్చు
బూతులు మాట్లాడటం, కోతలు కోయడం, ట్యాక్స్‌ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రీసెర్చ్‌ టీమ్‌ పెట్టుకుని ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్‌ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. రేవంత్‌ చెప్పేదొకటి.. చేసేదొకటని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో రెండు పార్టీలు పోటీపడుతున్నాయి. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబా నికి, రేవంత్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు.

తెలంగాణకు యూరియా పరిశ్రమ తీసుకొస్తే, పేదల ఇళ్లకు వెలుగులు తీసుకొస్తే అది గాడిద గుడ్డులా కనబడుతుందా? గెలవలేని సీట్లకు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని రేవంత్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం ఆపింది. ఎన్నికలు వస్తాయని ముందే తెలిసినా.. రైతుభరోసా ఎందుకివ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. తెలంగాణలో బీజేపీ రెండంకెల మార్కు దాటడం ఖాయం. మే 10న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని వివరించారు.

LEAVE A RESPONSE