Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేతల ధనదాహానికి దళితులు బలవుతున్నారు

– మాజీ మంత్రి కె. యస్ జవహర్

రాష్ట్రంలో ఇసుక దోపిడీ పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి కె.యస్ జవహర్ ద్వజమెత్తారు. రాజమండ్రిలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..ఇసుక దోపిడీ మాటున సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలు దళితుల ప్రాణాలు బలిగొంటున్నారు.మంత్రి తానేటి వనిత ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే గతంలో 7 రీచ్ లు ఉంటే ఇప్పుడు 7 కిలో మీటర్లకు పైగా రీచ్ లు ఏర్పాటు చేసుకుని ఇసుక సామ్రాజ్యాన్ని విస్తృతపరచుకున్నారు.

జేపీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వారు వచ్చాక వారికి కప్పం కట్టలేక ప్రేమ్ రాజు అనే యువకుడు బలవన్మరణం చెందాడు. జేపీ వెంచర్స్ మాటున జగన్మోహన్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి లకు కప్పం కట్టలేక రైల్వే ట్రాక్ కింద తలపెట్టి ప్రేమ్ రాజ్ చనిపోయాడు. ఇలాంటి దుర్మా్ర్గమైన పరిస్థితులు కొవ్వూరు నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇసుక ర్యాంప్ బాట నీటి ట్యాంకర్ తో తడుపుతూ ట్రాక్టర్ డ్రైవర్ దుర్గారావు ట్రాక్టర్ గోదావరిలో పడి చనిపోయాడు. అసలు.. ఎవరు చెబితే ఆ ర్యాంప్ తడపడడానికి వచ్చి అతను ప్రాణాలు కోల్పోయాడో హోం మంత్రి చెప్పాలి. హోంమంత్రి అమాయకంగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తోంది.

దుర్గారావు శవానికి దండేసి రూ. 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది, 5 లక్షలు ర్యాంపు యజమాని ఇస్తాడని హోంమంత్రి చెబుతున్నారు. ఇసుక తవ్వకాలకు జేపీ వెంచర్స్ గడువు ముగిసింది, కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ పూర్తవలేదు. మరి ఆ ఇసుక ర్యాంప్ యజమాని ఎవరో తెలియాలి. ఈనాడులో వచ్చిన వార్తకు కొందరు ఉలికిపాటుకు గురవుతున్నారు. ఏపీలో ఇసుక క్రాంట్టాక్టులు ఎవరికి అప్పగించారు, కేసీఆర్ బంధువులకా? ఇసుకలో జరుగుతున్న అక్రమాల్లో అధికారులకు వాటా ఉంది. మైనింగ్ విభాగం అంతా అవినీతిమయమైంది.

ఇక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ లో మంత్రి తానేటి వనితకి, సీఎంకి వాటాలున్నట్టు స్పస్టంగా అర్దమవుతోంది. వైసీసీ నేతలకు అధికార, ధన దాహం ఎక్కువైంది. నల్లజెర్లలో దస్తావేజు లేఖరిని తుపాకితో కాల్చి చంపారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? హోం మంత్రి హోంకే పరిమితమా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆమెకు అవసరంలేదా? నియోజకవర్గంలో దళితులు బలౌతున్నారు. దళితులపై జరిగిన దాడుల్లో ఎంతమంది నిందితుల్ని అరెస్ట్ చేశారో చెప్పగలరా? పదవిని అడ్డం పెట్టుకుని నిందితుల్ని కాపాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో హోం మంత్రి ఉంటే.. ఆ జిల్లాలోకి లైసైన్స్ లేని తుపాకులు ఎలా వస్తున్నాయి? దీనిపై విచారణ చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE