– మేం ఐదుగురికి ఇచ్చాం?
– వైసీపీ నేత పోతిన మహేశ్
విజయవాడ: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైసీపీనేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అగౌరవ పరిచారని అన్నారు. ‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని పెంచారు’ అని పేర్కొన్నారు.