కాంగ్రెస్‌లో బడుగులపై వివక్ష

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి ఆయనపై రకరకాలుగా ప్రచారం చేశార ని, రేవంత్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పైసలిచ్చి పీసీసీ చీఫ్‌ అయ్యాడంటూ అవహేళన చేశారన్నారు. ఓటుకు నోటు దొంగకు పీసీసీ చీఫ్‌ ఎలా ఇస్తారంటూ నిలదీశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ అయితే ఓ అడుగు ముందుకేసి రేవంత్‌ పీసీసీ చీఫ్‌గా ఉంటే తాము పార్టీలో ఉండ బోమని అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు. వీరంతా రేవంత్‌రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం వల్ల ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉండవన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలని అడిగి నందుకు దళితుడైన బక్క జడ్సన్‌పై క్రమ శిక్షణ ఉల్లంఘించారని వేటు వేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి సామాజికవర్గం వాళ్లు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని, కానీ ఎస్సీలు ఒక్క మాట అన్నా ఓర్వలేరని విమర్శించారు. ఇదేనా కాంగ్రెస్‌ పాటించే సామాజిక న్యాయం? ఇదేనా కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలకు దక్కే గౌరవమని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply