Suryaa.co.in

Andhra Pradesh

భక్తులు కొండ ఎక్కడానికీ అనుమతి కావాలా?

-పూర్తిస్థాయి ఈవోని నియమించకుండా ధర్మారెడ్డిని తాత్కాలిక ఈవోగా నియమించడానికి కారణమేంటి?
– ఏడుకొండలవాడితో ఆడుకున్నవారెవరూ బతికి బట్టకట్టిందిలేదని గుర్తుంచుకోండి
– తిరుమలలో భక్తులసొమ్ము రూ.144కోట్లు పక్కదారిపట్టినా, సౌకర్యాలలేమితో తిరుమలకువచ్చేవారు నానాఅవస్థలుపడుతున్నా ముఖ్యమంత్రికి పట్టదా?
• తిరుమలేశుడి దర్శనాన్నికూడా వ్యాపారాంశంగా మారుస్తారా? అందుకే టోకెన్లు లేకుండా భక్తులురావొద్దంటూకొత్తకొత్త నిబంధనలు పెడుతున్నారా?
• ఏడుకొండలవాడితో పెట్టుకున్నవారెవరూ బతికి బట్టకట్టిందిలేదని గుర్తుంచుకోండి.
• తక్షణమే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకుఇబ్బందులు లేకుండా దర్శనంజరిగేలా చూడండి
• తిరుమలలో పరిస్థితులు చక్కబెట్టేలా అధికారులను అప్రమత్తంచేసి, పూర్తిస్థాయి ఈవోని నియమించండి.
• స్వామివారిభక్తులకు జరిగిన అసౌకర్యాలకు బాధ్యతవహిస్తూ, వారికి తక్షణమే ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కలియుగప్రత్యక్షమైన తిరుమలక్షేత్రం అత్యంతపవిత్రమైన ప్రదేశమని, స్వామివారి దర్శనానికి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతికావాలనడం, లక్షలాదిగా తరలివచ్చే భక్తులంతా టోకెన్లు తీసుకున్నాకే వేంకటేశ్వరుని దర్శనానికి రావాలనడం చాలాచాలా విడ్డూరంగా ఉంద ని, అసలు తిరుమలలో ఏంజరుగుతోందో, అక్కడ భక్తులుఎదుర్కొంటున్నఘోరమైన పరిస్థి తులను చక్కదిద్దకుండా ప్రభుత్వంఏంచేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

తిరుమలకు వచ్చే భక్తులసంఖ్యనానాటికీ అధికమవుతోంది. వాటికన్ సిటీ సందర్శనకోసం వచ్చేభక్తులకంటే తిరుమలకువచ్చే భక్తులసంఖ్యే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వాటికన్ సిటీకి ఎలాగైతోపోతారో, తిరుమలకువచ్చిస్వామివారిని దర్శించుకునేభక్తుల సంఖ్య అంతకన్నాఎక్కువైంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను నిరోధించడమేంటి? వారికి కనీసవసతులు, తాగునీరు కూడా కల్పించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉందా? బాగాడబ్బున్న ధనవంతులైతే నేరుగాస్వామివారి దర్శనంచేసుకోవచ్చునని చెబుతున్నా రు. సామాన్యులు, పేదలకేమో దర్శనభాగ్యం దుర్లభమా?

తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా వేలాదిసంఖ్యలో భక్తులు కాలినడకన తరలివస్తుంటారు. అత్యంతపవిత్రమైన తిరుమల క్షేత్రంపైకి వెళితేచాలు.. స్వామివారి దర్శనంలేకున్నా… కనిపించే ఆలయానికి మొక్కి వెన క్కువచ్చినసందర్భాలు కోకొల్లలు. తిరుమలక్షేత్రంలోకాలుమోపి, అక్కడున్నధూళిని కళ్లకు అద్దుకుంటే చాలని భక్తులుభావిస్తారు. గరుడ సేవరోజైతే 6నుంచి 7లక్షలమంది భక్తులు వస్తారు. వారిలో లక్షమందికే దర్శనంలభిస్తుంది. మిగిలినవారంతా దర్శనంలేకపోయినా కూడా కొండపైకి వెళ్లి, అక్కడే మొక్కుకొని వెనక్కువచ్చేవారు చాలామంది ఉన్నారు.

అటువంటిది మీరుస్వామి దర్శనానికి సంబంధించి కొత్తనిర్ణయాలు తీసుకుంటారా? అత్యంత పవిత్రమైన తిరుమలక్షేత్రానికి పార్ట్ టైమ్ ఈవోని నియమిస్తారా? పూర్తిస్థాయి ఈవోని నియ మించకుండా భక్తులతో ఆడుకుంటారా? ధర్మారెడ్డికి సర్వాధికారాలు ఇవ్వడమేంటి? ఆయన గతంలో టీటీడీజేఈవోగా ఉండి, ఆల్కహాల్ తీసుకున్నాడని నిరూపితమైనప్పుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని బదిలీచేశారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టీటీడీలో పార్ట్ టైమ్ ఈవోగా నియమించి, సర్వాధికారాలు కట్టబెట్టి, తిరుమలనుఏలుకోమని చెప్పడమేంటి? అక్కడ పనిచేస్తున్న జవహర్ రెడ్డిని తీసుకెళ్లీ సీఎంవోలో పెట్టుకున్నారు. ధర్మారెడ్డి రిటైర్డ్ ఆర్మీ అధికారి. అలాంటి వ్యక్తికి తిరుమలకొండపైన సర్వాధికారాలు కట్టబెట్టారు.

గతంలో పింక్ డైమండ్ గురించి, తిరుమలపవిత్రత గురించి నానాయాగీ చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబుగారి దొడ్లోఉంది..అక్కడుంది..ఇక్కడుందని ప్రచారంచేసినవారు, అధికారంలోకివచ్చి మూడేళ్లయినా ఆ డైమండ్ ఎక్కడుందో తేల్చలేకచేతులు ముడుచుకొని కూర్చున్నారు. అదలాఉంటే కనీసం భక్తులు, మరీముఖ్యంగా చంటి పిల్లలతో సహా, స్వామివారి దర్శనానికి వచ్చేమహిళలు నానాఅవస్థలుపడుతున్నా పట్టించుకోరా?

మీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 200లకు పైగా హిందూదేవాలయాలపై దాడులు జరిగాయి. ఇష్టానుసారం విగ్రహాలను ధ్వంసంచేశారు. ఆఖరికి నీచాతినీచంగా రామతీర్థం ఆలయం లో రాముడితలను నరికేశారు. మరోవైపు పరమపవిత్రమైన తిరుమల ను వ్యాపారకేంద్రంగా మార్చారు. తిరుమలక్షేత్రంలో స్వచ్ఛందంగా సేవలుచేయడానికి తరలి వచ్చేవారినికాదని, ఆసేవలను బయటిసంస్థలకు, ప్రైవేట్ఏజెన్సీలకు అప్పగించారు. టీటీడీ లో అన్యమతస్తులైన ఉద్యోగులను నియమించి, ఆలయపవిత్రతనను మంటగలిపారు.

తిరుమలకొండపై అన్యమత ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం అందుకుబాధ్యులైన వారిపై ఎలాం టిచర్యలు తీసుకోలేదు. ఆఖరికి తిరుమల వెబ్ సైట్ నుంచి అశ్లీలతకు సంబంధించిన వెబ్ లింక్ ని భక్తులకు పంపితే, అందుకుకారకులైనవారిని శిక్షించలేదు. టీటీడీకి, స్వామివారికి భక్తులు ఇచ్చిన నిధుల్లో రూ.144కోట్లను దారిమళ్లించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూలేదు. స్వామివారి దర్శనానికి తరలివచ్చే లక్షలాదిభక్తులను కొండపైకి వెళ్లకుండా, కిందనేఆపేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు?

తిరుమల స్వామివారి దర్శనాన్ని కూడా వ్యాపారాంశంగా మారుస్తారా? భక్తులను టోకెన్లపేరుతో, సర్వదర్శనం పేరుతో అడ్డుకొని, కొండపైకి రావొద్దని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి ఉందా? లక్షలమందిని భక్తులను ఆపే అధికారం మీకుఎవరిచ్చారు? భక్తుల స్వామిని దర్శించుకోవడానిక కొండపైకి వెళ్లకుండా ప్రొహిబిషన్ ఏమిటి? ఏ అధికారంతో ఇలా చేస్తున్నారు?

ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు చేస్తారా? తిరుమలక్షేత్రానికి సంబంధించి పూర్తిస్థాయి ఈవోని నియమించడానికి మీకువచ్చిన ఇబ్బందేమిటి? గతంలోఎప్పుడూలేనివిధంగా తిరుమల వెబ్ సైట్లో అశ్లీలతకు చెందిన వెబ్ లింకులుపెట్టే పరిస్థితి ఎందుకువచ్చింది? స్వామివారి దర్శనానికి వచ్చినమహిళలు ప్రమాదకరంగా ఉన్నకంచెలపైనుంచి పిల్లలను విసిరేయడానికి కారణంఎవరు? తాడునీరు, నీడలేక భక్తులు అవస్థలుపడటం అనేది ఎన్నడైనా జరిగిందా?

ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడూ ఏడుకొండలవాడి జోలికిపోలేదు. అలావెళ్లిన వారెవరూ బతికి బట్టకట్టింది కూడాలేదు. తిరుమలలో సేవలందించడానికి పనికిరాడని స్వయంగా రాజశేఖర్ రెడ్డి బదిలీచేసిన అధికారిని జగన్మోహన్ రెడ్డి తిరిగి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగించడం ఏమిటి? ఉన్న ఈవోని తీసుకెళ్లి సీఎంవో పెట్టుకొని, ధర్మారెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చి తిరుమలను ఏలుకోమని చెబుతారా? ఇలాంటివి ఏమాత్రం కరెక్ట్ కాదని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని తిరుమలపవిత్రతపెంచేలా, భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా తక్షణమే చర్యలుచేపట్టండి. లేకపోతే ఆభగవంతుడే మిమ్మల్నిశిక్షించడంఖాయం. స్వామిదర్శనంకోసం తిరుమలకొండపైకి నడిచివచ్చే భక్తులను వెంటనే అనుమతించండి.

తిరుమల క్షేత్రంలో జరుగుతున్న సంఘటనలు చాలాచాలా దురదృష్టకరం. ఇలాంటి వాటిని అధికారపార్టీవారు కూడా హర్షంచరని తెలుసుకోండి. మేం శ్రీవారి భక్తులుగానే మాట్లాడుతూ, పరిస్థితిని చక్కదిద్దుకోండని సూచిస్తున్నాం. ఏడుకొండలస్వామి అంటే జనం గుండెల్లో ఉండే దైవం. శనివారం నాడు చాలామంది హిందువులు శాఖాహారంతో పవిత్రంగా నియమాలు పాటించి స్వామివారిని దర్శించుకుంటూఉంటారు.

అలాంటి దేవుని దర్శనానికి వెళ్లే సాధారణ భక్తులను అడ్డుకుంటూ, డబ్బున్నవారిని దర్శనానికి అనుమతిస్తారా? తిరుమలలో ఫుల్ టైమ్ ఈవోని తక్షణమే నియమించి, భక్తులు ఇబ్బందులను తొలగించండి. తిరుమలకొండపై జరిగిన తప్పిదాలకు, భక్తులు పడుతున్న అవస్థలపై ముఖ్యమంత్రి, ప్రభుత్వం తక్షణమే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE