అధికారులూ అడ్డదారుల్లో వెళ్లి చిక్కుల్లో పడకండి

-మిమ్మల్ని జగన్‌ కాపాడలేడు
-ఓట్ల నమోదులో తప్పుడు విధానాలు అవలంబిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వివిధ రాజకీయ నాయకులతో నిర్వహించిన సమీక్షలో తెలుగుదేశం పార్టీ తరపున పోలిట్ బ్యూరో సభ్యలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఓట్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతికి, తప్పుడు విధానాలు అవలంబిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓటర్ల జాబితాలో తెలిసి తప్పుడు విధానాలు అవలంభించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసామని వర్ల రామయ్య తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తుకై యువత కదలి వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకొని అరాచక పాలనకు స్వస్తి పలకండని ఆయన పిలుపునిచ్చారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ… ‘‘చిలకలూరిపేట నుంచి గుంటూరుకు మంత్రి విడదల రజినీని మార్చారు. విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్‌కు మాజీ మంత్రి వెల్లంపల్లిని, వేమురు నుంచి సంతనూతలపాడుకి మంత్రి మేరుగను, మంత్రి సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండేపికి ఇలా ఒక చోట నుంచి ఇంకోచోటకి జగన్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌లను బదిలీ చేశాడు. చిలకలూరిపేటలో ఉన్న ఓటర్లను గుంటూరుకు, విజయవాడ వెస్ట్ అనుకూల ఓటర్లను సెంట్రల్‌కు, వేమురు ఓటర్లను సంతనూతలపాడుకు మార్చుకొవాలని ప్రయత్నాలు చెస్త్నున్నారు. ఇప్పటికే ఓట్ల మార్పిడికై సంబంధిత అధికారులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుల చేసినట్లు తెలిసిందన్నారు. ఇవి అన్నీ దొంగ ఓట్ల ప్రక్రియలో భాగం. తప్పుడు విధానాలు, దొడ్డి దారుల్లో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రయత్నిస్తుంది.

కింది స్థాయి అధికారులందరికీ చెప్తున్నాం…తప్పుడు విధానాలకు మీరు బాధ్యులవ్వకండి. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు కదా అని తప్పుడు విధానాల్లో ఓట్లు నమోదు చేస్తే కలెక్టర్ గిరీషాకు పట్టిన గతే మీకు పడుతుంది. 81 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. తప్పు చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదు. గెజిటెడ్‌ ఆఫీసర్‌గా సంతకం పెట్టే హక్కు లేని ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ ఇంటర్ మీడియట్ చదివిన వ్యక్తి కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాడు. అతన్ని పట్టుకొని వెంటనే అతనిపై చర్యలు తీసుకోండని డిమాండ్ చేసాం. తప్పుడు ఓట్ల రిజిస్ట్రషన్‌పై విజయవాడ మున్సిపల్ కమీషర్‌కు చెప్తే అతను ఈ విషయాన్ని సరిగా పరిగణలోకి తీసుకోలేదు.

పూర్తి ఆధారాల ఓటరులిస్టుతో ఎన్నికలకు వెళ్లాలి. ఇంకా ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయి. 50, 100, 1500 మంది ఓటర్లు ఉన్న ఇళ్లున్నాయి. భారతదేశంలో 1500 ఓట్లు ఉన్న కుటుంబమే లేదు. ఓటర్ల జాబితాలో ఇంకా దొంగ ఓట్లున్నాయని ఎన్నికల కమీషనర్ ఒప్పుకున్నారు. యుద్ధప్రాతిపదికన దొంగ ఓట్లను తొలిగించి, వాటికి కారణమైన వారపై కూడా చర్యలు తీసుకోవాలని మరోసారి ఫిర్యాదు చేసాం. కలెక్టర్ గిరీషా మీదే కాదు తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ఓటర్లందరికీ నా విజ్ఞప్తి.. తప్పుడు విధానాలు, అవినీతి, అరాచక ప్రభుత్వాలకు స్వస్తి పలికి మన గురించి ఆలోచించి చిత్తశుద్ధితో పని చేసే, ప్రజా సంక్షేమాన్ని ఆలోచించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. అందులో 2,00,74,322 పురుషులు, 2,07,29,452 స్త్రీలు ఉన్నారు. యువ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. రాష్ట్ర యువతకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను… గౌరవ బాధ్యత కలిగిన పౌరులుగా యువత కదలి రావాలి.

ఓటర్ల నమోదుకు ఇంకా గడువు ఉంది గనుక, ఓటు హక్కు పొందేందుకు అర్హత గలవారు త్వరగా నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదై ఓటు అనే ఆయుధంగా ఈ అరాచక, అవినీతి పరిపాలను తరిమికొట్టి చంద్రబాబు ప్రజాస్వామ్య పరిపాలనకు స్వాగతం పలకాలని వర్ల రామయ్య తెలియజేశారు.

Leave a Reply