– 70 కోట్ల బడ్జెట్
– 875 రైతు గ్రూపులకు మరియు ఎఫ్. పి.ఓ లకు 80% సబ్సిడీ తో రైతులకు డ్రోన్స్
– ఒక సారి ఛార్జ్ చేస్తే 20 ఎకరాలు స్ప్రే
– ప్రతి జిల్లాలో ఒక రిపేర్ సెంటర్ ఏర్పాటు
అమరావతి: 2024-25 ఆర్థిక సంవత్సరమునకు గాను 875 రైతు గ్రూపులకు మరియు ఎఫ్. పి.ఓ లకు 80% సబ్సిడీ తో రైతులకు డ్రోన్స్ అందించాలని నిర్ణయించింది. దీనికి ఈ ఆర్ధిక సంవత్సరం లో 70 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ పధకానికి గాను వ్యవసాయ శాఖ మండలానికి కనీసంగా 1 రైతు గ్రూప్ ని ఎంపిక చేసుకుంది.
ఈ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఎంపన్నేల్మెంట్ కు DGCA ద్వారా అనుమతి పొందిన డ్రోన్స్ కంపనీ లను ఆహ్వానించింది. ఈ ఎంపన్నేల్మెంట్ లో బాగంగా ఒక స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ ని నియమించింది.వ్యవసాయ శాఖ ఈ కమిటీ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలను, ఫార్మ్ మెకనైజెషన్ నుంచి నిపుణలను మరియు డ్రోన్ కార్పొరేషన్ నుంచి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ మరియు FMTTI నుంచి నిపుణులతో ఒక కమిటీ ను ఎంపిక చేశారు.
ఈ కమిటీ వారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా పనిచేసేయందుకు వివిధ రకాల వ్యవసాయ డ్రోన్స్ ఒక ప్రోటోకాల్ ను తయారుచేశారు. ఈ ప్రోటోకాల్ ద్వారా డ్రోన్స్ పరీక్షించడానికి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో 10 ఎకరాల టెస్టింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు.ఎంపన్నేల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న DGCA అనుమతి పొందిన కంపెనీలను 60 రోజుల పాటు DGCA రూల్స్ ప్రకారం మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించిన స్టాండర్డ్ ఓపెరేటింగ్ ప్రొసీజర్ రూల్స్ ద్వారా పాసైన డ్రోన్స్ ఫీల్డ్ లో మరొక సారి టెస్ట్ చేయటం జరిగింది.
ఆ డ్రోన్స్ నిర్ధిష్ట వేగం , కచ్చితమైన ఎత్తు మరియు వ్యవసాయ అవసరాలకు అనుగుణమైన డ్రోన్స్ మాత్రమే ఆమోదించారు.ఈ టెస్టింగ్ లో ఆమోదించిబడని డ్రోన్స్ ను తర్వాత ఎంపన్నేల్మెంట్ కు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.
వ్యవసాయ శాఖ డ్రోన్ దీదీ ద్వారా గడిచిన అనుభవాన్ని పరిశీలించి ఈ సారి డ్రోన్ అందించడంలో కొన్ని ప్రత్యేక అవసరాలను పేర్కొంది.ఇందులో ఒక డ్రోన్ యూనిట్ 4 సెట్లు ఆదనపు బ్యాటరీ లతోపాటు స్పెర్స్ ను రైతులకు అందించాలని నిర్ణయించారు.ఈ యూనిట్ లో ఉన్న బ్యాటరీ లను ఒక సారి ఛార్జ్ చేస్తే 20 ఎకరాలు స్ప్రే చేయవచ్చు అని తెలిపారు.ఈ యూనిట్ ద్వారా రైతులకు అదనంగా లాభం చేకూరుతుంది.
రైతులకు సకాలంలో సేవలు అందించటానికి వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాలో ఒక రిపేర్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయించింది.దీనితో పాటు ప్రతి డ్రోన్ కు 3 సంవత్సరాలు AMC అందించాలని కంపనీ కి తెలిపారు.ఈ యూనిట్ ఖర్చులోనే రైతుకు DGCA ఆమోదించిన సర్టిఫికెట్ అందిస్తున్నామని తెలిపారు.కమిటీ ద్వారా ఆమోదించిన కంపెనీ లు SMAM స్కీం ద్వారా రైతులకు డ్రోన్ అందించే యోచన వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.