– రామ్మోహన్‌నాయుడితో మాట్లాడవచ్చుకదా?
– టీడీపీ నాయకత్వ మందలింపు
అమరావతి: విశాఖపట్నం విమాన ప్రయాణికుల దుస్థితిపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆంధ్ర to ఆంధ్ర via తెలంగాణ’ అంటూ గంటా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని, లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మనవారే. ఆయనకు ఫోన్ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించినట్లు సమాచారం.