జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు

– కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం
– సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. నిర్వహణను విస్మరించి, రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షానికి కారణమైన జగన్ సర్కార్, దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది

• జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది.
• కరువు మండలాల ప్రకటన, కేంద్రప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
• రాష్ట్రప్రభుత్వం అనుసరించిన రైతువ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2శాతం రైతు కుటుంబాలు అప్పులపాలు అయ్యాయి
• టీడీపీ ప్రభుత్వంలో 73శాతం పూర్తైన పోలవరంప్రాజెక్ట్ ను పూర్తిచేయకపోవడం, ఇతర సాగునీటిప్రాజెక్టుల నిర్వహణను జగన్ సర్కార్ పట్టించుకోనందునే రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది
• ప్రకృతివిపత్తులు, కరువువల్ల రాష్ట్ర రైతాంగం రూ.80వేలకోట్లు నష్టపోయింది.
• రాష్ట్రప్రభుత్వ తీరుతో ధాన్యంసేకరణలో వైసీపీ దళారుల దోపిడీతో వరిరైతులు 5 ఏళ్లలో రూ.21వేలకోట్లు నష్టపోయారు.
• విద్యుత్ సబ్సిడీ ధర పెంపుతో ఆక్వారైతులు రూ.10వేలకోట్లు నష్టపోతే, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లేక రైతాంగం రూ. 10వేలకోట్లు నష్టపోయింది.
• చంద్రబాబుపాలనలో ఖరీఫ్, రబీసీజన్లలో కోటి 42 ఎకరాలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో 2023-24లో రెండుసీజన్లలో కూడా కేవలం 30లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది
• టీడీపీ ప్రభుత్వం గడచిన 5 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు యాంత్రకరణ పరికరాల కోసం రూ.65వేలకోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ30వేలకోట్లు మాత్రమే ఖర్చుచేసింది.
• ఏటా ఒక్కో రైతుకి రూ.12,500లు రైతుభరోసా సాయం ఇస్తానన్న జగన్ రెడ్డి, చివరకు రూ.7,500లు మాత్రమే ఇచ్చి, ఒక్కో రైతుకి 5ఏళ్లలో రూ.25వేల వరకు ఎగ్గొట్టాడు.
• చంద్రబాబు రైతురుణమాఫీ, అన్నదాతా సుఖీభవ కింద ఒక్కోరైతుకి రూ.లక్షవరకు అర్థిక సహాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం రూ.37,500లతో సరిపెట్టాడు.
• రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయి.

– టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్

పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టి, ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరివల్లే, రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితి తలెత్తిందని, రైతులకు సాగునీరు లేకుండా పోయిందని టీడీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ చంద్రబాబు హాయాంలో పూర్తైన 73శాతం నిర్మాణ పనుల్ని పూర్తిచేసి, పోలవరం ప్రాజెక్ట్ ని అందుబాటులోకి తీసుకొచ్చి, రైతులకు సాగునీరు అందించి ఉంటే నేడు రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తేది కాదు. రాబోయే దుర్భిక్ష పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు, పోలవరం నిర్మాణం కంటే ముందే పట్టి సీమ లిఫ్ట్ ను నిర్మించి కృష్ణాడెల్టాకు సాగునీరు అందించి, పంటలు ఎండిపోకుండా చూశారు. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుచెప్పి పోలవరం నిర్మాణ పనుల్ని పూర్తిగా అటకెక్కించారు.

జగన్ రెడ్డి నిర్ణయాలతో పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సకాలంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన నిర్మాణాలు పూర్తిచేయకపోవడంతో వేలకోట్ల నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బృందం ప్రాజెక్ట్ ను పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేటికీ సరైన స్పందన లేదు. తత్ఫలితమే రాష్ట్ర రైతాంగం అథోగతి పాలు కావడం.

చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీ సీజన్లలో కోటి42 ఎకరాల్లో పంటలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో కేవలం 30లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి

చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీ సీజన్లలో కోటి42లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో 2023-24లో రెండు సీజన్లలో కలిపి కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. ఎందుకిలా జరిగిందంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్లే. అలానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డ్రిప్, స్ప్రింక్లర్ విధానం, ఇతర యాంత్రీకరణ పరికరాలు రైతులకు సబ్సిడీపై అందించడానికి టీడీపీ ప్రభుత్వం గడచిన 5 ఏళ్లలో రూ.65వేలకోట్లు ఖర్చుచేయగా, జగన్ రెడ్డి ప్రభుత్వం రూ30వేలకోట్లు మాత్రమే ఖర్చుచేసింది.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పాలకుల నిర్లక్ష్యవైఖరితో ప్రకృతి విపత్తుల వల్ల రాష్ట్ర రైతాంగం రూ.80 వేలకోట్లకు పైగా నష్టపోయింది. ధాన్యం సేకరణలో వైసీపీ దళారుల దోపిడీ పెరిగి, ప్రభుత్వం కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో వరిరైతులు తమ ఉత్పత్తుల్ని అయినకాడికి తెగనమ్ముకోవాల్సి వచ్చింది. జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో 5 ఏళ్లలో ధాన్యం రైతులు రూ.21వేలకోట్లు నష్టపోయారు.

ఆక్వారైతు లకు అందించే విద్యుత్ సబ్సిడీని వైసీపీప్రభుత్వం యూనిట్ ధరను రూ1.50పై సల నుంచి రూ.3.50పైసలకు పెంచడం వల్ల వారు రూ.10వేలకోట్లకు పైగా నష్ట పోయారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే చర్యలతో జగన్ సర్కార్ వారి మెడలకు ఉరితాళ్లు బిగిస్తోంది. అప్రకటిత విద్యుత్ కోతలు, ఉద్యాన వన పంటలు సాగుచేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, నాసిరకం విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం వంటి ప్రభుత్వ చేతగాని చర్యలతో రైతులు మరో రూ.10వేల కోట్లు నష్టపోయారు.

చంద్రబాబు రైతురుణమాఫీ, అన్నదాతా సుఖీభవ కింద ఒక్కోరైతుకి రూ.లక్షవరకు అర్థిక సహాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం రూ.37,500లతో సరిపెట్టాడు తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి రైతు ఆత్మహత్యలు, రైతు కుటుంబాల అప్పులపై ఏపీ అగ్రస్థానంలోనిలవడంపై ఏం చెబుతాడు?

రైతుభరోసా పేరుతో రాష్ట్రప్రభుత్వ వాటాగా ఒక్కో రైతుకి ఏటా రూ.12,500లు ఇస్తామనిచెప్పిన జగన్ రెడ్డి, చివరకు రైతుల సంఖ్యలో కోతపెట్టి, ఇస్తామన్న సొమ్ముని కేవలం రూ.7,500ల కే పరిమితం చేసి, రైతుల్ని మోసగించారు. ఒక్కో రైతుకి ఐదేళ్లలో రూ..25,000లు ఎగ్గొట్టారు. కేంద్రప్రభుత్వం పీఎం.కిసాన్ యోజన పథకంకింద రైతులకు అందించే రూ.6,500ల సొమ్ముని తానే ఇస్తున్న ట్టు జగన్ ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు గతంలో ఒక్కో రైతుకి ఒకేసారి రూ.50వేలవరకు రైతు రుణమాఫీ చేయడమే గాకుండా, అన్నదాతా సుఖీభవ ద్వారా ఒక్కోరైతుకి రూ.లక్ష వరకు లబ్ధి కలిగించారు.

చంద్రబాబు రైతులకోసం అమలుచేసిన పథకా లు మొత్తం రద్దుచేసిన జగన్ రెడ్డి, చివరకు రైతుభరోసా పేరుతో కేవలం రూ.37,500లు మాత్రమే ఇస్తూ వారిని ఉద్ధరిస్తు న్నట్టు సాక్షి మీడియాలో అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు హాయాంలో కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3లక్షల వరకు రైతులకు సున్నావడ్డీ, పావలావడ్డీ రుణాలు అందించారు. జగన్ హాయాంలో పావలావడ్డీని రద్దుచేశారు. రాష్ట్రంలో సుమారు 30లక్షల మంది కౌలురైతులు ఉంటే, వారిలో కేవలం 80వేల మందికి మాత్రమే జగన్ సర్కార్ రైతుభరోసా కింద అరకొర సాయం అందించింది.

కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రప్రభుత్వం అనుసరించిన రైతువ్యతిరేక విధానాలవల్లే రాష్ట్రంలో సుమారు 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పులపాలు అయ్యాయి. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో 3వస్థానంలోనూ, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది. తమది రైతు ప్రభుత్వమని, రైతుల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రైతుకుటుంబాల అప్పులు, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం ముందంజంలో నిలవడంపై ఏం సమాధానం చెబుతారు?
కరువు మండలాల ప్రకటనలో రాజకీయం చేసిన జగన్, కేంద్రప్రభుత్వం నుంచి కరువు సాయం సాధించడంలో ఘోరంగా విఫలమయ్యాడు

రాష్ట్రంలో సంభవించిన కరువు పరిస్థితులకు సంబంధించి, ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు, సరైన నివేదికలు కేంద్రప్రభుత్వానికి వెళ్లలేదు. కరువు మండ లాలకు కేంద్రప్రభుత్వం కేటాయించే నిధుల్ని కూడా ఏపీ ప్రభుత్వం సాధించలేక పోయింది. కరువు మండలాల ప్రకటన విషయంలో, నిధులు సాధించే విషయం లో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్ర రైతాంగం దారుణంగా దెబ్బతిన్నది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 466 మండలాల్లో సెప్టెంబర్ వరకు పూర్తిగా పొడివాతావరణం ఉంటే, 335 మండలాల్లో కరువు సూచనలు కనిపించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో వైసీపీప్రభు త్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర రైతాంగం పూర్తిగా కుదే లైంది. యుద్ధప్రాతిపదికన కరువు మండలాలను ఆదుకోవాల్సిన జగన్ సర్కార్ పూర్తిగా ప్రతిపక్షాలపై రాజకీయ కక్షసాధింపులకే పరిమితమైంది. ల్యాండ్ టైటిలిం గ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్ సర్కార్ నిర్వాకంతో, రైతులు భూముల్ని సర్వేచేసే పేరుతో వారి స్వాధీనంలోని భూములపై వారు హక్కులు కోల్పోయేలా వ్యవహ రించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్రప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకమని, రాజ్యాంగానికే పూర్తి విరుద్ధమని కొన్నాళ్లుగా న్యాయవాదులు నిరసనలు తెలు పుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందనలేదు.
రైతాంగం సమస్యల పరిష్కారంపై జగన్ వెంటనే దృష్టి పెట్టకపోతే, రైతులు ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారు

జగన్ సర్కార్ఇప్పటికైనా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయడం.. ఉత్తుత్తి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలు చేయడం ఆపేసి, రైతుల్ని ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రైతులు వ్యవసాయాన్ని వదిలేయ డం ఖాయం. అదేగానీ జరిగితే ప్రజలకు జీవనాధారం ఉండదు. ప్రభుత్వం తక్షణ మే నీటిపారుదల ప్రాజెక్టుల్లో పంటలసాగుకు అవసరమైన కనీస నీటిని నిల్వ ఉంచి తక్షణమే రైతులకు సాగుకు అవసరమైన నీటిని అందించాలి.

రైతుల భూముల్ని కబ్జాపాలు కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతాంగం సమస్యల పరిష్కారంపై జగన్ ప్రభుత్వం తక్షణమే దృష్టిపెట్టకపోతే, రైతులతో పాటు ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో వైసీపీప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపుతారు. అనేక ఏళ్ల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు పాలనతోనే రైతాంగం సమస్యలు పరిష్కారమవుతాయి.” అని కనకమేడల స్పష్టం చేశారు

 

Leave a Reply