Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర ఆరోగ్య పథకం ఎల్.ఎ.సి మెంబర్ గా గుమ్మడి సీతారామయ్యచౌదరి

గుంటూరు: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సి.జి.హెచ్ ఎస్) లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా గుంటూరుకు చెందిన సెంట్రల్ జి.ఎస్.టి సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యచౌదరి ని నియమిస్తూ, సి.జి.హెచ్.ఎస్ అడిషనల్ డెరైక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరుపున నియమితులైన సీతారామయ్యచౌదరి ని శుక్రవారం సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని జి.ఎస్.టి భవన్ లో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్యచౌదరి కృషి చేయాలని సూచించారు. సి.జి.హెచ్.ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు.

డిపార్ట్మెంట్ కు ఎనలేని సేవలు అందించిన సీతారామయ్యచౌదరి కి ఈ హోదా దక్కటం శాఖకు గర్వకారణమన్నారు.
సి.జి.హెచ్.ఎస్, ఎల్.ఎ.సి మెంబర్ సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ..ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు తన వంతు విశేషంగా కృషి చేస్తానన్నారు.

సి.జి.హెచ్.ఎస్ లో సౌకర్యాల కల్పన కు పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. నగదు రహిత చికిత్సను పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా సి.జి.హెచ్.ఎస్ వైద్య సదుపాయాన్ని అందిపుచ్చుకోవచ్చునని తెలిపారు. ఉద్యోగులకు, పెన్షనర్ల కు సేవ చేసే బాధ్యత ఇచ్చిన సి.జి హెచ్ ఎస్ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ రోహిణి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీతారామయ్యచౌదరిని పుష్పగుచ్చాలతో పలువురు ఉద్యోగులు అభినందించారు.

కార్యక్రమంలో ఎ.పి సెంట్రల్ జి.ఎస్.టి ఉద్యోగులు, పెన్షనర్ల సంఘ నేతలు టి.వివేకానంద, గద్దె తిలక్, యుగంధర్, పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, కె.సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE