– ‘తల్లికివందనం’తో తాదాత్మ్యంలో తల్లిదండ్రులు
(భూమా బాబు)
ప్రతి ఒక్కరిలో పట్టరాని ఆనందం. ఒక తరగతి పైకి వెళ్ళిన గర్వం, విద్యా సంవత్సరం మొదటి రోజే సరికొత్త పాఠ్యపుస్తకాలు అందుకున్న సంతోషం.
ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం కాగానే సరస్వతి ఒడిలో ఇలాంటి సంతోషకర వాతావరణమే వెల్లివిరిసింది. విద్యావంతుడైన ప్రస్తుత మంత్రి త్వరితగతిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమే దీనికి కారణం.
ఒకసారి గత రోజులను గుర్తు చేసుకుంటే… ఐబీ సిలబస్‌ను, సెమిస్టర్లను ప్రవేశపెట్టిన “విప్లవాత్మకమైన” జగన్ హయాంలో సెమిస్టర్‌లు వస్తూ పోతుండేవి కానీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సెమిస్టర్ అయిపోయాక గానీ అందేవి కావు. ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చినా పుస్తకాలు వచ్చేవి కావు.
ప్రైవేటుగా కొనుక్కుంటామన్నా కూడా, “ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, ఇక్కడే తీసుకోవాలి” (బహుశా కమీషన్ల కోసమే) అని నిబంధన విధించి విద్యార్థులను వేధించిన రోజులు అవి. అప్పట్లో బయట ఎక్కడికెళ్ళినా, ఆయన బొమ్మతో ఉన్న బెల్టులు, బ్యాగులు, పుస్తకాలతో విద్యార్థులను సులభంగా గుర్తుపట్టేవారు, ఆయాన దయా రాజ్యంలోని బానిసల్లా కనిపించేవారు.
ఈ ఏడాది తీసిన ఫోటోలను మరోసారి గమనించండి. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల మాదిరిగా, ఎటువంటి దరిద్ర చిత్రాలు లేకుండా, డీసెంట్ యూనిఫామ్‌తో, పుస్తకాలు పుస్తకాలలాగే ఆహ్లాదకరంగా, గౌరవప్రదంగా కనిపిస్తున్నాయి కదూ? ఇది కేవలం మార్పు కాదు, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా వేసిన కీలక అడుగు.