Suryaa.co.in

National

కూలిపోయే కొంపలో ఉంటారా?.. ఇండియాకు వచ్చేయండి!

– భారతీయులు అమెరికా వ్యామోహం వదుల్చుకోవాల్సిన తరుణం
– అమెరికా ప్రపంచంలో అత్యంత వేగంగా పతనం కాబోయే ఆర్థిక వ్యవస్థ
– సర్దేసుకోండి…ఎంత వీలయితే అంత తొందరగా
– భారత్ లో ఉన్న డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోండి
– వెల్కమ్ బ్యాక్ టూ గ్రేట్ భారత్…వికసిత భారత్!

భారతీయులు అమెరికా వ్యామోహం వదుల్చుకోవాల్సిన తరుణం…నేనేమీ ఎక్కువ చెప్పడం లేదు. రాబోయే నాలుగేళ్లు అత్యంత కీలకమైన సమయం. అంత పెద్ద అమెరికాకు ఏమౌతుంది అన్న సందేహం రావచ్చు. అమెరికా ప్రపంచంలో అత్యంత వేగంగా పతనం కాబోయే ఆర్థిక వ్యవస్థే కాదు. అట్టడుగు కి చేరిన నైతిక రాజకీయ ప్రమాణాలు కలిగిన పతన వ్యవస్థ.

అమెరికన్లకు అంతర్గతంగా ఒక వ్యవస్థీకృత విభజన మూలంలోనే ఉంది. అది ఏర్పడినప్పుడే…విడిపోవడానికి బీజం వేసుకుంది. ఆ దేశంలో ట్రంప్ లాంటి వ్యాపారి ఎన్ని జాతీయతా హొయలు ఒలకబోసినా సామాన్యుడు దానికి తాత్కాలికంగానే కనెక్ట్ అవుతాడు. స్థానిక జాతులను నాశనం చేసి చేరిన క్రైస్తవ గుంపులు తప్పితే…నేటివ్ ఎవ్వడూ లేని ప్రదేశం అది.

ఆ తరువాత మరిన్ని గుంపులు విచ్చలవిడి తనాన్ని దోపిడీని అనుభవించడానికి చేసుకున్న తాత్కాలిక రాజ్య వ్యవస్థే వాళ్ళది. మహా అయితే ఐదు వందల ఏళ్ళు చరిత్ర….చీదితే ఊడిపోయే ముక్కు. చైనా వేగంగా వాళ్ళని అనుసరించి…ప్రపంచ జ్ఞానం ఎత్తుకొచ్చి…బ్రహ్మాండంగా బాగుపడింది. టైమ్ చూసి వదిలేసింది.

అంతకీ కావాలంటే…ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వల్ల అమెరికాకు కావలసిన సేవా సంబంధిత పనులన్నీ ఇక్కడినుంచే చెయ్యొచ్చు… పైసలు సంపాదించుకోవచ్చు. కీలకమైన ప్రయోగాలు…మౌలిక పారిశ్రామిక రంగాలు మినహాయించి..మిగతా వాళ్ళందరూ ఎంత వీలయితే అంత తొందరగా బయట పడడం మంచిది.

అతి తొందరలో వివిధ జాతుల మధ్య పోరాటాలు హింసా రూపం తీసుకుంటాయి అక్కడ. అంతేనా.. అమెరికా పెంచి పోషించిన ఇస్లాం తీవ్రవాదం పూర్తిగా అమెరికాను అదుపులోకి తీసుకుంటుంది. ఆ.. ఇంకా యాభై ఏళ్ళు వందేళ్లు పట్టవచ్చు అనుకుంటారేమో…పదేళ్ళు కూడా పట్టదు. గుర్తు పెట్టుకోండి…అభివృద్ధి మెల్లగా అవుతుంది..పతనం వేగంగా ఉంటుంది.

ట్రంప్ ఓడిపోయినప్పుడు… శ్వేత సౌధం ఆక్రమణ దానికి సంకేతం. అంటే అది శ్రీలంక బంగ్లాదేశ్ ల కంటే కూడా దరిద్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. మొన్న లాస్ ఏంజిల్స్ లో గొడవలు ఆపలేక పోయింది.తుపాకీ సంస్కృతి బాగా ఎక్కువయ్యింది.

చైనా ,రష్యా …ఇస్లాం శక్తులు పూర్తిగా విద్యా వైద్య సాంకేతిక రంగాలను..యూనివర్సిటీస్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటివరకూ చైనా లాగానే ఎక్కడా ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా విజయం సాధించిన దాఖలా లేదు…కూటమిగా తప్ప. అమెరికా సైన్యం అనుకున్నంత గొప్పదీ కాదు…ఆయుధాలు అసలే గొప్పవి కావు.

అమెరికా ప్రపంచ తీవ్రవాది అని…మొన్న మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద కొట్టిన దెబ్బతో క్లియర్ అయిపోయింది.వాడెంత తీస్ మార్ ఖాన్ గాడో అర్థం అయ్యింది. ఇంక అమెరికా పెద్ద పెద్ద ఏడుపులు ప్రారంభిస్తుంది చూడండి. భారత వ్యతిరేక ప్రాపగాండా పూర్తిగా అమెరికనైజ్ అయిన ఇండియన్స్ ద్వారా చేసుకొస్తుంది. అది భవిష్యత్తు లో ఎంత తెంపరితనానికైనా తెగిస్తుంది.

మనం ఎదగడం అస్సలు సహించలేని అసూయా దురాశా పూరిత దేశం అది. అయినా అమెరికన్ స్టాండర్డ్స్ ఎలాంటివో…ట్రంప్ ను ..అంతకు ముందు బైడెన్ ను అమెరికాకు అధ్యక్షులుగా ఎన్నుకున్నప్పుడే అర్థం అయిపోవాలి. వెర్రి బాగుల ప్రజలున్న దేశం అది. ఇద్దరికిద్దరే…అయోమయం..అంధకారం… అతి చేష్టలు. ఆ దేశాన్ని కట్టి ఉంచే ఒక సిద్ధాంతం…ధర్మం ఏమీ లేవు.

వచ్చే ఐదేళ్లలో అమెరికా జీడీపీ తగ్గుతూ పోతుంది.వృద్ధి రేటు ఋణాత్మకం అవుతుంది. అమెరికా చిన్న పిల్లలకు అకౌంట్ లోకి వెయ్యి డాలర్లు వేస్తా అన్నాడంటే…దాని ఆర్థిక వ్యవస్థ బోలుతనం తెలుసుకోవాలి. సబ్ ప్రైమ్ లెండింగ్ పద్ధతిలో జనాలకి అప్పులు ఇచ్చి మునిగి బ్యాంకులు పోయాయి.

దివాళా తీయబోయే అమెరికా అప్పులన్నీ మీ మీద నెట్టేసి…మీ బ్రతుకులు వైట్ హౌస్ కి వేసిన సున్నం చేసేస్తుంది. అయినా విదేశం అంటే అమెరికా ఒక్కటే కాదు. కూలిపోయే కొంపలో కాపురం ఉండాలనుకోవడం చాలా అమాయకత్వం. ఒకే ఒక్క విషయం గమనించండి. భారత్ లో అనేక మెట్రో సిటీలు అమెరికా నగరాలకు ఇప్పుడు ఏమీ తీసిపోవు.

చాలా మంది విద్యార్థులే అది చెబుతున్నారు. సర్దేసుకోండి…ఎంత వీలయితే అంత తొందరగా. భారత్ లో ఉన్న డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోండి. ఇళ్ళు స్థలాలు కొనుక్కోండి…ఇక్కడ ఆస్తులు సమకూర్చుకోండి. స్వదేశంలోని గుడులకు..బడులకు…సేవా సంస్థలకు విరివిగా విరాళాలు ఇచ్చేయండి. ఆ పుణ్యంతో..హాయిగా సమ శీతోష్ణ మండలంలో మీ పిల్లలను…సనాతన సంస్కారాలతో పెంచుకోండి.

మోడీ ఇంకా పదేళ్లు ఉంటాడు..
ఈలోగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రశాంతంగా ఉండండి…
మంచి తరుణం మించిన దొరకదు…
వెల్కమ్ బ్యాక్ టూ గ్రేట్ భారత్…వికసిత భారత్!
జైహింద్!

– సేకరణ

LEAVE A RESPONSE