-పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం
-జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం
-11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం
-పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం
-పీఎం స్వనిధి ద్వారా 1 లక్షా 3 వేల మందికి లబ్ది చేశాం
-స్వచ్ఛ భారత్ ద్వారా 30 లక్షల టాయిలెట్ల నిర్మాణం
-తెలంగాణకు 7 కోట్ల 76 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-ప్రజలకు కేంద్రం చేసిన మేలుపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని మీడియాకు వినతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, కట్టా సుధాకర్ తోపాటు ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, వీరెళ్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనపై ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. అట్లాగే ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ ప్రత్యేక వెబ్ సైట్ ను విడుదల చేశారు. 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యాల్లోని ముఖ్యాంశాలు…
కేంద్రంలో నరేంద్రమోదీ గారి 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘‘మహాజన సంపర్క్ అభియాన్’’ పేరుతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ కేంద్రం చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి నుండి జూన్ నెలాఖరు వరకు తెలంగాణలో అనేక కార్యక్రమాలను రూపొందించాం. అన్ని జిల్లాల్ల్లోని నేతలంతా ఈ కార్యక్రమాలను అమలు చేయాలి. అందులో భాగంగా… జూన్ 1 నుండి 7 వరకు… పార్లమెంట్ వారీగా మీడియా సమావేశాలు నిర్వహించాలి. సోషల్ మీడియా ఇంటారాక్షన్స్ నిర్వహించాలి. వికాస్ తీర్థ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సందర్శించాలి.
జూన్ 8 నుండి 14 వరకు …. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకుల సమ్మేళనం నిర్వహించాలి. అట్లాగే అసెంబ్లీ వారీగా మోర్చాల సంయుక్త సమ్మేళనం నిర్వహించాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులతో అత్మీయ సమావేశం నిర్వహించాలి. జూన్ 15 నుండి 21 వరకు…… రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న అన్ని మండలాల్లో ఘనంతా యోగా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలి.
జూన్ 22 నుండి 28 వరకు…. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందిన వారిని గుర్తించి శక్తి కేంద్రాల వారీగా వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలి. అట్లాగే గడప గడపకు బీజేపీ పేరుతో ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలపై విస్త్రత ప్రచారం నిర్వహించాలి. ఇంటింటికీ కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేయాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినమైన జూన్ 23న ప్రతి పోలింగ్ బూత్ లో కార్యక్రమాలు నిర్వహించాలి. జూన్ 25న ప్రతి పోలింగ్ బూత్ లో ‘‘మన్ కీ బాత్’’ నిర్వహించాలి. ఇక 9 ఏళ్లలో మోదీ గారి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్బుతం. అందులో ముఖ్యమైన నాలుగైదు అంశాలను మాత్రమే ప్రస్తావిస్తాను. మీకు తెలుసు. మోదీ గారు రాకముందు దేశంలో ఒకే కుటుంబ పాలన కొనసాగింది. ‘‘అప్నా పరివార్…అప్నా వికాస్’’ పేరుతో దేశాన్ని లూటీ చేశారు.
2జీ స్కాం, బోగ్గు స్కాం సహా ఎటు చూసినా అవినీతి కుంభకోణాలే. మోదీ గారు వచ్చాక మచ్చ లేని అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. నాడు ఒక కుటుంబమే రాజ్యమేలితే… మోదీ గారికి 140 కోట్ల భారతీయులే తన కుటుంబమైంది. రాజ్ పథ్, కర్తవ్య పథ్, రేస్ కోర్సులు పోయి… ఇయాళ లోక కళ్యాణ్ మార్గ్ గా మారింది. ప్రధానమంత్రి ప్రజలకు ప్రధాన సేవకుడిగా మారారు. నేను ప్రధానమంత్రిని కాదు… ప్రధాన సేవకుడిని అంటూ మోదీ గారు పాలనలో నూతన ఒరవడి సృష్టించారు.
‘‘ఇండియా ఫస్ట్’’ అనేది మోదీ గారి వైఖరి… ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా.. ఏ కార్యక్రమం చేపట్టినా… ఏ నిర్ణయం తీసుకున్నా…. నూటికి నూరుపాళ్లు దేశం కోసమే… కులమతాలకు… భాషాబేధాలకు అతీతంగా పనిచేస్తూ పేదలు, అణగారిన వర్గాలు, వివక్షకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు…
గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. మన తెలంగాణలో 55 లక్షల మందికి రేషన్ ఉచితంగా అందిస్తున్నారు. పీఎం అవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు నిర్మించి నిలువ నీడలేని వాళ్లందరికీ గూడు కల్పిస్తున్నారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం పేరుతో ఏం జరుగుతుందో మీకు తెలుసు.
కేంద్రం రాష్ట్రానికి 3.5 లక్షలకుపైగా ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో 2.5 లక్షల ఇండ్లు అర్బన్ ఆవాస్ యోజక కింద 4 వేల 466 కోట్లు మంజూరు చేస్తే… ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు కూడా పూర్తి చేయలే. అవి పూర్తి చేస్తే మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోవడం లేదు.
స్వచ్ఛ భారత్ కింద 11.72 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు….తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా నేటికీ చీకట్లోనే మగ్గుతున్న 2 కోట్ల 86 కోట్ల కుటుంబాలను గుర్తించి సౌభాగ్య పథకం కింద కరెంట్ వెలుగులను ప్రసరింపజేశారు. ఇందులో తెలంగాణలో 5 లక్షల 15 వేల ఇండ్లకు కరెంట్ సౌకర్యం కల్పించారు. ఉజ్వల యోజన కింద 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు అందించారు. తెలంగాణలోని ఆడపడచులకు కట్టెల పొయ్యి బాధ లేకుండా 11 లక్షల 50 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించారు.
29 కోట్ల 75 లక్షల మంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద లబ్ది పొందుతున్నారు. 13 కోట్ల 53 లక్షల మంది పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పరిధిలోకి వచ్చారు… జల్ జీవన్ మిషన్ కింద 11.88 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నారు. సమృద్ధిగా కరెంటు… ఇలా చెప్పుకుంటూ పోతే పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.. అసెంబ్లీ వారీగా 119 బహిరంగ సభలు నిర్వహిస్తాం. దీంతోపాటు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతించాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాం.
మోదీ సాధించిన విజయాలు, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలపైనే జనంలోకి వెళతాం. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదాన్ని విజయవంతం చేయలేకపోయింది. బీజేపీ ఆ నినాదాన్ని సాకారం చేస్తోంది.
అట్లాగే కేంద్రం రూపాయి విడుదల చేస్తే 15 పైసలే లబ్దిదారుడికి చేరుతుందని ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పారు. అవినీతికి తావులేకుండా డీబీటీ విధానం రూపాయికి రూపాయి విడుదల చేస్తే నేరుగా లబ్దిదారులకు అందుతోంది.