Suryaa.co.in

Telangana

గ్లోబల్ సిటీగా హైదరాబాద్

– తరలివస్తున్న అంతర్జాతీయ వాణిజ్య,వ్యాపార సంస్థలు
– పోటా పోటీగా పెట్టుబడుల వెల్లువ
-దేశంలోనే ఇక్కడ అత్యధికంగా వృద్ధి రేటు
-ప్రపంచ స్థాయి పరిశ్రమ లు పోటా పోటీగా తరలి వస్తున్నాయి
-ఉన్నత విద్యావంతులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: గ్లోబెల్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య సంస్థలు ఇక్కడికి తరలి రావడం ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులు వెల్లువెత్తడం ఇందుకు నిదర్శనమన్నారు.

గురువారం ఉదయం బంజారాహిల్స్ లోని ముఫ్ కాంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు టెక్నలజీలో జరిగిన నూతన విద్యార్థుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ మహిపాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జనాబ్ జాఫర్ జావేద్ సాహెబ్,గౌరీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధి రేటులో యావత్ భారతదేశంలోనే తెలంగాణా అగ్రభాగాన నిలుచుందన్నారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రపంచ స్థాయి పరిశ్రమలు పోటీ పడుతున్నాయాన్నారు.

హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్య వేత్తలు వెల్లువలా వస్తున్నారన్నారు.ఉన్నత విద్యావంతులకు గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ఉపాధి అవకాశాలకు కొదువ ఉండదని విధ్యర్డులనుదేసించి ఆయన చెప్పారు.

ఇప్పుడు ఇంజినీరింగ్ లో అడుగు పెడుతున్న మీకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. మీ భవిష్యత్తు ను మీకు మీరుగా తీర్చిదిద్దుకునేందుకు ఎంచుకున్న ఏ మార్గమైనా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థులకు హితవు పలికారు.

LEAVE A RESPONSE