-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్మోహన్ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారు.వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
రైతులు బిల్లులు చెల్లించాక, తదుపరి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు.అసలు మీటర్లు బిగించటం, బిల్లులు తీయటం, రైతులకు తిరిగి ఖాతాల్లో జమ చేయటం వంటి తతంగం ఎందుకు?ఇదంతా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం కాదా?కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు జగన్ సర్కార్ సై అంటూ అమలుకు పూనుకోవటం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది.